సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి గేట్లు తెరిచామని ప్రకటించిన విషయం తెలిసిందే.దీనితో జిల్లాలోని గులాబీ లీడర్లు హస్తం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందులో భాగంగానే కోదాడ పట్టణ బీఆర్ఎస్ అద్యక్షుడు చందు నాగేశ్వరరావు తన అనుచరులతోటి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.శనివారం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చందు నాగేశ్వరావు కలవడం దీనికి బలం చేకూరుతుంది.