60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుంది:తండు శ్రీనివాస్ యాదవ్

సూర్యాపేట జిల్లా:60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, సిడబ్ల్యూసి సభ్యురాలు సోనియాగాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ ఓబీసీ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని తండు శ్రీనివాస్ యాదవ్ నివాసంలో సోనియా గాంధీ( Sonia Gandhi ) జన్మదిన వేడుకలను ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

 The Credit Of Fulfilling A 60-year-old Dream Goes To Sonia Gandhi: Thandu Sriniv-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దం పాటు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల ఓపిక,సహనం,మొక్కవోని అకుంఠిత చైతన్యమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నాంది పలికిందన్నారు.

అవినీతి,అక్రమాల బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) నుంచి ఓటు అనే వజ్రాయుధంతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను హామీ మేరకే తొలి సంతకాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేశారని,ఇచ్చిన హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో నిధులు,నీళ్లు, నియామకాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.

ఆరు గ్యారంటీ పథకాలను( Six Schemes ) ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు కృషి చేసి,ఐక్యమత్యంతో ప్రభుత్వానికి సహకరించి పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఓబీసీ భాగం రాష్ట్ర కోఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్,జిల్లా ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ గుంటి సైదులు ముదిరాజ్,ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు గంజికుంట్ల గోపీనాథ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎస్,కె,సైదా ఖాసీం, గుంటూరి చిట్టిబాబు, ఎస్.కె.రెహమాన్ భాయ్, సిద్ధి పరుశురాం యాదవ్, మామిడి నాగరాజు, సూర్యప్రకాష్,పోలెబోయిన లింగరాజు యాదవ్, గుద్దేటి శ్యామ్,జిల్లేపల్లి సైదాచారి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube