భూ ప్రకంపనలతో జనం ఆందోళన...!

సూర్యాపేట జిల్లా: చింతాలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో 2020 నుంచి అప్పుడప్పుడు భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.తాజాగా సెప్టెంబర్ నెలలోనే చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో రెండుసార్లు భూప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

 Pulichintala Project Premises Earthquake, Pulichintala Project ,earthquake, Sury-TeluguStop.com

గతంలో భూకంపం ప్రభావంతో రెండు ఇల్లు పాక్షికంగా నెర్రలు వచ్చాయని స్థానికులు వాపోతున్నారు.అయితే గతంలో పాత వెల్లటూరు కేంద్రంగా రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3 గా నమోదైంది.

భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఇళ్లకు నష్టం జరగలేదు.

పులిచింతల జలాశయానికి సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు రిక్టర్ స్కేలు ఏర్పాటు చేసి,దీనివల్ల ప్రమాదం లేదని మళ్ళీ తొలగించారు.

గత కొంతకాలంగా భూప్రకంపనల ప్రభావం లేకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.తాజాగా శుక్రవారం రాత్రి 9:28 నిమిషాలకు ఒక మోస్తారు శబ్దంతో 5 నుండి 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తుంది.పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంఫై ఆందోళన జనం ఆందోళన చెందుతున్నారు.అయితే ఇవి భారీ భూకంపం కాదని,భయపడాల్సిన అవసరం లేదని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube