అట్రాసిటి కేసులు త్వరగతిన పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్‌

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎస్సీ,ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు.బుదవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ లో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు,ఎక్స్‌గేషియా వివరాలను జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ది అధికారిణి దయానంద రాణిని రిపోర్ట్ అడగగా 2016 నుండి ఇప్పటివరకు 25 కేసులు నమోదు అయినట్లు వివరించారు.

 Atrocity Cases To Be Completed Expeditiously: Additional Collector , Additional-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి త్వరితగతిన కేసును విచారణ చేసి ప్రాథమికంగా 25శాతం నష్టపరిహారం ఇప్పించాలని సూచించారు.ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు.

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, సివిల్స్‌ రైట్స్‌ డే నిర్వహించినప్పుడు కమిటి సభ్యులను ఆహ్వానించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్,ఆర్‌డివోలు రాజేంద్రకుమార్,వెంకారెడ్డి, కిషోర్‌కుమార్,సూర్యాపేట డిఎస్‌పి నాగభూషణం, ఎస్‌సి కార్పొరేషన్‌ ఈడి శిరీష,డిటిడిఓ శంకర్, డిఎఫ్‌ఓ ఉపేందర్‌ సింగ్‌, ఎస్‌డిపిఓ వెంకటేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్‌ పీపీ రాథోడ్‌ సుభాష్‌,అడ్వకేట్‌ దాచేపల్లి లింగయ్య, కమిటీ సభ్యులు వెంకారెడ్డి,సిహెచ్‌ రాములు,ఎన్‌.

ప్రకాష్‌బాబు,గూగుల్‌ అచ్చమ్మ,బుక్కా రవి,ఏ.శ్రవణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube