కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.మనలో చాలా మందిని వేధించే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.
వయసు పైబడిన వారిలోనే కాదు యువతీ,యువకులను సైతం ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే నల్లటి వలయాలకు అనేక కారణాలు ఉన్నాయి.
నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి, ఒత్తిడి, హర్మోన్లలో మార్పులు, పలు రకాల మందుల వాడకం, డీహైడ్రేషన్ వంటివి నల్లటి వలయాలకు ప్రధాన కారణాలు అవుతుంటాయి.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.
విటమిన్ ఎ లోపం కూడా నల్లటి వలయాలకు ఓ కారణం అవుతుంది.సాధారణంగా శరీరంలో విటమిన్ ఎ లోపిస్తే.
కంటి చూపు తగ్గడం, కళ్లు పొడి బారడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి.అలాగే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయి.
ఈ సమస్యను నివారించుకోవాలంటే.శరీరానికి సరిపడా విటమిన్ ఎ ను తప్పకుండా అందించాలి.
అందుకోసం పాలకూర, కాలే, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడదుంపలు, గుమ్మడికాయ, నారింజ పండ్లు, టమోటాలు, రెడ్ క్యాప్సికమ్, సీతాఫలం, మామిడి పండ్లు, పాలు, గుడ్డు, చేపలు, బొప్పాయి, అవకాడో వంటి ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కలంగా నిండి ఉంటుంది.వీటిని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి సరిపడా విటమిన్ ఎ లభిస్తుంది.
తద్వారా కంటి చూపు పెరగడమే కాదు కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు సైతం దూరం అవుతాయి.

అలాగే కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను కొన్ని కొన్ని చిట్కాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా నాలుగు టేబుల్ స్పూన్ల నారింజ రసంలో హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ ను మిక్స్ చేసి.కళ్ల చుట్టూ అప్లై చేసుకోవాలి.
పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.రోజుకు ఒకసారి చేస్తే నల్లటి వలయాలు దూరం అవుతాయి.

పుదీనా ఆకులను మెత్తగా నూరి జ్యూస్‌ను వేరు చేయాలి.ఈ జ్యూస్‌లో రోజ్ వాటర్‌ను యాడ్ చేసి కళ్ల చుట్టూ అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.