సూర్యాపేట జిల్లా: వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాప్రతినిదులు,అధికారులు సమన్వయంతో కృషి చేయాలని,వేసవి కాలంలో నీటి ఎద్దడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి పలు సూచనలు చేశారు.కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి అధ్యక్షతన మిషన్ భగీరథ పనులు మరియు త్రాగునీటి సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులలో జరగాల్సిన పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని,వేసవికాలం రాబోతున్నందున ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని,స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహకారంతో అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని చెప్పారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయశ్రీ,ఎంపీఓ పాండు రంగన్న,మిషన్ భగీరథ డీఈ అభినయ్,ఏఈలు రిత్విక్,సిద్దార్ధ,ఆర్.
డబ్ల్యూ.ఎస్ ఏఈ రవి కుమార్, మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.