సూర్యాపేట జిల్లా:అభివృద్ధి పేరుతో పేద దళితుల భూములు లాక్కోవడం అన్యాయమని నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన బాధితులు ములకలపల్లి భద్రమ్మ,మంద ఉప్పమ్మఅవేదన వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…మా గ్రామంలోని సర్వే నంబర్ 109 లో ఒక ఎకరం ప్రభుత్వ భూమిని దళితులమైన తాము చెరి 20 గుంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు.
మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ప్రభుత్వ భూమిని గత 20 సంవత్సరాల నుంచి తామేసాగులో ఉన్నామని,ఇటీవల కాలంలో తన భర్తకు ఆరోగ్యం బాగోలేక హైదరాబాదులో చికిత్స నిమిత్తం అక్కడే ఉంటున్నామని అన్నారు.
ఈ నేపథ్యంలో నూతనకల్ మండల రెవెన్యూ సిబ్బంది వచ్చి పల్లె ప్రకృతి వనం కోసం ఈ భూమిని కేటాయించామని ఈ భూమిపైన సాగు చేస్తే పోలీసుల చేత కేసు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు.
ఈ భూమిని తమ బంధువుల నుంచి కొనుగోలు చేశామని 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉంటే ఎలా ఆక్రమిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.భూమి లేకపోతే బ్రతకలేమని మందు పోసుకుని చస్తామని కన్నీరు పెట్టారు.
ఈ కార్యక్రమంలో సైదులు, ఎల్లయ్య,జ్ఞానసుందర్ తదితరులు పాల్గొన్నారు.