నల్లగొండ జిల్లా:దేశంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని,సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదల కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో రుద్రాక్ష యాదగిరి నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం ఆయన భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో పాస్ చైర్మన్ వెంకటేశ్వరరావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగాల వెంకన్న,కొండయ్య, మాజీ వార్డు మెంబర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.