వృద్ధురాలిని హత్య చేసిన మహిళ

సూర్యాపేట జిల్లా:సాంకేతికత పెరిగింది,చట్టాలు బలోపేతం చేయబడ్డాయి,నేరాలకు పాల్పడితే ఏనాటికైనా శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.18వ తేదీన గరిడేపల్లి మండలం కోదండరామాపురంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నందు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.ఈ నెల18వ తేదీన గరిడేపల్లి మండలం కోదండరామాపురం గ్రామంలో నల్లబోలు రంగమ్మ(70) అనే వృద్ధురాలిని హత్య చేసి,ఆమె ధరించిన బంగారు ఆభరణాలు దొంగలించారు.సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు ఆధారాలు,క్రైమ్ సీన్ ను పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు.దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టామన్నారు.29 తేదీన గరిడేపల్లి పీఎస్ పరిధిలోని ఎల్ బీ నగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న తల్లి కొడుకులను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందన్నారు.వీరు కోదండరామాపురం గ్రామానికి చెందిన కొనిరెడ్డి సరితగా గుర్తించి,సరితను తనిఖీ చేయగా దొంగిలించిన బంగారం లభ్యం కావడంతో విచారణ చేయగా 18 వ తేదీన కోదండరామాపురంలో జరిగిన వృద్ధురాలి హత్యకు సంభందించి ఆధారాలు సరిపోవడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.దొంగతనం చేసే క్రమంలో వృద్దురాలి హత్య ప్రదేశంలో దొరికిన మెడ నుండి తెంచిన బంగారం గొలుసు పూసలు,సరిత వద్ద లభించిన బంగారం గొలుసు పూసలు సరిపోలడంతో వృద్దురాలి హత్యకు పాల్పడినది వారేనని నిర్ధారించడం జరిగిందని చెప్పారు.

 The Woman Who Murdered The Old Woman-TeluguStop.com

కేసు వివరాల్లోకి వెళితే కొడదండరామపురం గ్రామానికి చెందిన కోనిరెడ్డి సరిత పాలకేంద్రం నడుపుతుంది.సరిత గ్రామస్తుల వద్ద పాలు సేకరించి ఇతరులకు అమ్మేది.గునుగుంట్లపాలెం గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి సరిత వద్ద పాల కేంద్రంలో ఆటోలో పాలు తీసుకుని వెళ్ళేవాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.

పాలు పోసే గ్రామస్తులకు డబ్బులు ఇవ్వకుండా జల్సాలు చేసేది.గ్రామస్తులు డబ్బులు అడుగుతుండడంతో గ్రామస్తుల నుండి తప్పించుకోవడానికి,డబ్బులు అడగకుండా ఉండడానికి పథకం ప్రకారం ఫిబ్రవరి నెలలో పాల కేంద్రంలో ఉన్న యంత్రాలను వైబ్రేటర్,ప్రింటర్స్ లను ఇంటి వెనకాల గల గడ్డివాములో దాచిపెట్టి,ఎవరో దొంగతనం చేశారని గ్రామస్తులను నమ్మించింది.

సతీష్ తో సన్నిహితంగా ఉండడం,ఫోన్ లో మాట్లాడడం గమనించిన ఆమె భర్త విషయాన్ని గ్రామపెద్దలు తెలిపాడు.ఈ విషయమై సరితను గ్రామపెద్దలు మందలించారు.

పెద్దమనుషులపై కోపంతో ఓ పెద్దమనిషికి చెందిన గడ్డివాములను మార్చి నెలలో తగలబెట్టింది నిందితురాలు సరిత.పాలు పోసే గ్రామస్తులు పాల పైసలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా, పాల అప్పులు తీర్చేందుకు తన కొడుకుతో కలిసి పథకం ప్రకారం ఈ నెల18 వ తేదీన అదే గ్రామానికి చెందిన రంగమ్మ ఇంట్లోకి వెళ్లి నిద్రపోతున్న రంగమ్మ తలపై దుప్పటి పెట్టీ శ్వాస ఆడకుండా చేసి ఆమెను హత్య చేశారు.

రంగమ్మ వంటిపై ఉన్న సుమారు 5 తులాల బంగారం దొంగిలించారు.రంగమ్మ ఇంట్లోని పాల వికో యంత్రాలు దొంగిలించి,అనుమానం రాకుండా ఉండాలని దొంగతనం చేసిన యంత్రాలను వేరే వారి ఇంట్లోని గడ్డివాములో వేశారు.

దొంగతనానికి పాల్పడ్డ సమయంలో అక్కడ దొరికిన ఆధారాలతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.సరిత వద్ద నుండి బంగారం,పాల యంత్రాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు.

కేసు చేధనలో బాగా పని చేసిన డిఎస్పీ రఘు,సిఐ రామలింగారెడ్డి,ఎస్ఐ కొండల్ రెడ్డి,ఐటీ కోర్ ఎస్ఐ శివ,కానిస్టేబుల్స్ ను ఎస్పీ అభినందించి,ప్రోత్సాహకాలు అందించారు.ఈ సమావేశం నందు అదనపు ఎస్పీ రితిరాజ్, డిఎస్పీ రఘు,సిఐ రామలింగారెడ్డి,ఎస్ఐ కొండల్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube