యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలో మహావీర హనుమాన్ శోభయాత్ర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం శంకరానంద స్వామి ఆధ్వర్యంలో అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం నుండి గ్రామ పుర విధుల గుండా అంగరంగ వైభవంగా శోభయాత్ర జరిపారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.