సూర్యాపేట జిల్లా: మార్చి 19న కోదాడ పట్టణంలోని బాలాజీనగర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వెంటనే ప్రకటించాలని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.శనివారం ఆయన కోదాడలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు జరిగి నేటికి వారం రోజులు గడిచినా,లబ్ధిదారుల జాబితాను నోటీస్ బోర్డుల్లో పెట్టకపోవడం విడ్డురంగా ఉన్నదన్నారు.
గతంలో కోదాడ మండలంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు.ఇప్పుడు బాలాజీ నగర్ డబుల్ బేడ్ రూమ్ లబ్ధిదారుల లిస్ట్ ప్రకటించడంలో జాప్యం జరుగుతుండడంతో దీంట్లోనూ అవినీతి జరుగుతున్నట్లు దరఖాస్తుదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయని, వెంటనే బాలాజీనగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను కోదాడ మున్సిపల్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్,ఆర్డీవో ఆఫీస్ నోటీస్ బోర్డుల్లో పెట్టాలని కోరుతూ కోదాడ ఆర్డీవో,ఎమ్మార్వో, మున్సిపల్ కమీషనర్ లకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు.