సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో ఇటీవల అనుమతులు లేకుండా డీజే నిర్వహించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.సదరు డీజేని యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం తహశీల్దార్ బండ కవిత రెడ్డి ముందు హాజరు పరచగా డీజే యాజమానికి రూ.30 వేల జరిమానా విధించింది.అనుమతులు లేకుండా డీజే నిర్వహించమని నెల రోజుల క్రితం తహశీల్దార్ దగ్గర లక్ష రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేసిన తర్వాత కూడా డీజే నడపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గరిడేపల్లి ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ ఇకపై మండలంలో ఎవరైనా సరే అనుమతులు లేకుండా డీజే నిర్వహిస్తే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.