గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల( Garidepalli ) కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ( SP Sunpreet Singh ) ఆకస్మిక తనిఖీ చేశారు.దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను,రికార్డులను ఆయా మండలాల సంబంధించిన సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ ఆరా తీశారు.

 Sp Surprise Inspection Of Garidepalli Police Station, Sp Sunpreet Singh, Garidep-TeluguStop.com

పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను, నేరాలు జరుగుతున్న తీరును ఎస్ఐను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు వాటిపై నమోదైన కేసులు వాటిని అదుపు చేసే విషయంలో తీసుకున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో అతిపెద్ద రెండవ మండలమైన గరిడేపల్లిలో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉన్నారని ఎస్పీ దృష్టికి విలేకరులు తీసుకురాగా పరిశీలిస్తామని తెలిపారు.రాజకీయ చైతన్యవంతమైన గ్రామాలు చాలా ఉన్నాయని,ఇటీవల కొన్నిచోట్ల దొంగతనాలు జరిగాయని విలేకరులు అడగగా నేరాలు, దొంగతనాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, హుజూర్ నగర్ సిఐ చరమందరాజు,గరిడేపల్లి ఎస్ఐ ఈట సైదులు, ఏఎస్ఐ రాములు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube