విద్యుత్ ఆటోమేటీక్ స్టార్టర్ల తొలగింపును విరమించాలని రైతుల రాస్తారోకో

సూర్యాపేట జిల్లా: వ్యవసాయ మోటార్లకు ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని జిల్లా రైతు సంఘం కార్యదర్శి దండా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.గురువారం ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని నెమ్మికల్లు ప్రధాన రహదారిపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా కోతలు విధిస్తూ,ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్న ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించే చర్యలకు పాల్పడితే,పంటలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 Farmers Protest To Stop Removal Of Electric Automatic Starters In Atmakur Mandal-TeluguStop.com

వేలాపాలాలేని విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ఉండలేక విద్యుత్ మోటార్లకు ఆటోమేటిక్ స్టార్టర్లు బిగించుకొని కొద్దిపాటి పంటలను సాగు చేసుకుంటున్నారని, ఇప్పుడు స్టార్టర్లు తొలగిస్తే అనేక ఇబ్బందులు పడతారని,అందుకే ప్రభుత్వం ఆ ప్రయత్నం మానుకోవాలని అన్నారు.విద్యుత్ సరఫరాలో లోపాలను అధికారులు మరో విధంగా చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా నీటి సరఫరాలో అంతరాయంతో,విద్యుత్ కోతల కారణంగా పంట పొలాలు ఇప్పటికే ఎండిపోతున్నాయని,

అధికారం కోసం రైతులను మోసం చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే కోతలు లేని 24 గంటల కరెంటు అందజేసి,ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగింపు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

సుమారు గంటన్నర పాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ కార్యక్రమంలో సిపిఎం, బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నేతలు అవిరే అప్పయ్య, వేల్పుల వెంకన్న,శ్రీనివాస్ రెడ్డి,దామోదర్ రెడ్డి,బెల్లంకొండ పర్వతాలు, సుందరయ్య,దండ అరవింద్ రెడ్డి,బీరెల్లి వెంకట్ రెడ్డి,పేరం లక్ష్మినర్సు,రైతులు సంజీవ రెడ్డి,గుండాల విష్ణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube