కైకాల సత్యనారాయణ జీవితంలో ఆసక్తికర సంఘటన.. విషం కూడా వరంగా మారిందే..?? 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎస్‌.వి.రంగారావు( S V Ranga Rao ) తర్వాత మళ్లీ అంతటి మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ కైకాల సత్యనారాయణ( Kaikala Satyanarayana) ఒక్కరే అని చెప్పుకోవచ్చు.నవరసాలనూ అవలీలగా పలికించగల ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు కూడా లభించింది.

 Facts About Kaikala Sathyanaraya Life , Kaikala Satyanarayana, Tollywood, S V R-TeluguStop.com

కైకాల సత్యనారాయణ సినిమాల్లోకి రాకముందు అతని జీవితంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.ఆ ఇన్సిడెంట్‌తో తాను జీవితంలో ముందుకు వెళ్లగలను, అనుకున్నది సాధించగలను అనే ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలిగాడు.

జులై 25న కైకాల సత్యనారాయణ జయంతి.ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఆ ఆసక్తికర సంఘటన ఏంటో తెలుసుకుందాం.

Telugu Chennai, Coffee, Ranga Rao, Spider, Tollywood-Movie

సత్యనారాయణకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టం ఉండేది.సినిమాలపై ఎంత ఇష్టం ఉందో చదువుపై కూడా అంతే గౌరవం ఉండేది.అందుకే డిగ్రీ అయిపోయే వరకు సినిమాల్లోకి రాలేదు.కాలేజీ రోజుల్లోనే ఆయనకు మూవీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చేవి కానీ వాటన్నిటినీ కాదనుకున్నాడు.డిగ్రీ పూర్తి చేసిన వెంటనే మద్రాస్ కి వెళ్లి సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు.అయితే సత్యనారాయణకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేవి.

చేతిలో డబ్బులు లేక, రూమ్ రెంట్ కట్టలేక పార్క్ లోనే 15 రోజులు పాటు తలదాచుకున్నాడు.తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ఒక రూమ్ లో స్టే చేయడం మొదలుపెట్టాడు.

ఒకరోజు సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయి రూమ్‌కు చేరుకున్నాడు.ఒక పనిమనిషి వచ్చి అతడికి కాఫీ ఇచ్చింది.

అదంతా తాగిన తర్వాత కాఫీ కప్పు అడుగు భాగంలో చచ్చిపోయిన ఒక సాలెపురుగు కనిపించింది.అది చూడగానే అతడు షాక్ అయ్యాడు.

ఈ విషయం తెలిసి ఫ్రెండ్స్ కూడా కంగుతున్నారు.సాలె పురుగు విషంతో సమానం అని, అది పడిన కాఫీ తాగటం మంచిది కాదని, ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇచ్చారట.

Telugu Chennai, Coffee, Ranga Rao, Spider, Tollywood-Movie

కానీ కైకాల సత్యనారాయణ ఏ మిత్రుడి సలహా వినలేదు.“ఇప్పటిదాకా సినిమాల కోసం తిరిగి ఫెయిల్ అయ్యా.నాకు అదృష్టం ఉంటే అవకాశాలు వస్తాయి.నటుడుగా రాణిస్తా.మంచి నటుడు అవ్వాలని నా నుదుటిపైన రాసిపెట్టి ఉంటే ఇలాంటి సాలె పురుగులు నన్ను ఏమీ చేయలేవు.” అని సత్యనారాయణ తనలో తానే అనుకుంటూ ఏ ఆస్పత్రికి వెళ్లకుండా అలాగే పడుకున్నాడు.అయితే కైకాల కాఫీ తాగినా ఉదయం ఆరోగ్యంగానే లేచాడు.చిన్న అస్వస్థతకు కూడా లోను కాలేదు.దాంతో అతనిలో ఉత్సాహం రెట్టింపు అయింది.కచ్చితంగా మంచి యాక్టర్ ని అవ్వగలననే నమ్మకం కలిగింది.

ఆ నమ్మకంతోనే అవకాశాల కోసం తిరుగుతూ సిపాయి కూతురు సినిమాలో హీరో రోల్ సంపాదించాడు.ఆ మూవీలో అతను బాగానే నటించాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

దాని తర్వాత చిన్న పాత్రలు వేస్తూ చివరికి విఠలాచార్య దృష్టిలో పడ్డాడు.ఈ డైరెక్టర్ కైకాలకు “కనకదుర్గ పూజా మహిమ( Kanakadurga Pooja Mahima ) సినిమాలో విలన్ రోల్ ఆఫర్ చేశాడు.

అందులో నటించిన తర్వాత కైకాల కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube