కేసీఆర్ ఎక్కడ ?  కేటీఆర్ ను ఆడేసుకున్న రేవంత్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) పైన,  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.తెలంగాణ శాసనసభలో కేటీఆర్,  రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

 Cm Revanth Reddy Comments On Kcr In Telangana Legislative Assembly, Ktr, Brs, B-TeluguStop.com

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరగడంపై వీరిద్దరి మధ్య విమర్శలు,  ప్రతి విమర్శలు కొనసాగాయి.సీఎం రేవంత్ రెడ్డి సభలో ఉండి సహచర మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబుతో మాట్లాడించడంపైకేటీఆర్ విమర్శలు చేయగా , వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

  అన్ని విషయాల్లో ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉందని,  బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చకు అనుమతించాలని కోరామని , సభకు ఆలస్యంగా వచ్చిన సభ్యుడు అసలు విషయం తెలుసుకోకపోతే ఎలా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు.

Telugu Central Budget, Congress, Telanganacm-Politics

 నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కుల గురించి సభలో చర్చ జరుగుతున్నప్పుడు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, పదేళ్లు సీఎం అని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఎక్కడ దాక్కున్నారని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రశ్నించారు.  శాసనసభలో కనిపిస్తే ప్రధాని మోదీ ఏమనుకుంటారో అనే భయంతో కేసిఆర్ ఎక్కడో దాక్కున్నారంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.సభలో కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభను కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని , గాలివాటం మాటలను సభలో మాట్లాడుతున్నారని , ఇప్పటికైనా ప్రతిపక్షం తమ పద్ధతి మార్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Telugu Central Budget, Congress, Telanganacm-Politics

ఢిల్లీ వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని , సభలో ఆ చీకటి ఒప్పందాల గురించి చెప్తారా లేదా బడ్జెట్ పై ఇంకేమైనా అభిప్రాయం చెబుతారో తెలుసుకోవడానికి చర్చ ప్రారంభించామని,  ఇప్పటి వరకు కేటీఆర్( KTR ) పేమెంట్ కోటా అనుకున్నారని,  కానీ ఇప్పుడే ఆయన ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అని తేలిందని రేవంత్ ఎద్దేవా చేశారు.తాము స్వయంకృషితో రాజకీయాల్లో ఎదిగామని,  జెడ్పిటిసి, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే , ఎంపీగా పనిచేశానని,  తాను తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రిని అవ్వలేదని కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube