కొన్ని జంతువులు మనుషుల పట్ల చాలా ప్రేమ, విశ్వాసం చూపిస్తూ ఉంటాయి.ఇలాంటివి ఎక్కువగా కుక్కలలో మనం గమనించవచ్చు.
వాటికి కొద్దిగా ఆహారం పెడితే చాలు.మనలన్ని ఎంతో ప్రేమగా, కేర్ టేకింగ్ గా చూసుకుంటాయి.
కేవలం కుక్కలు మాత్రమే కాకుండా పిల్లలు, గుర్రాలు, ఏనుగులు కూడా మనుషులతో ఇలాంటి ఎమోషనల్ బాండింగ్‌ను కలిగి ఉంటాయి.వాటిని బాగా చూసుకునే వారికి ఏదైనా చిన్న జబ్బు కలిగితే చాలు అవి కూడా తెగ బాధపడిపోతాయి.
ఇలాంటి ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు మనం ఇదివరకే సోషల్ మీడియాలో చూసే ఉన్నాము.ఇలాంటి మరో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
జీవితాంతం తనను ఎంతో ప్రేమగా చూసుకున్న ఓ వ్యక్తి తన చివరి దశలో హాస్పిటల్ బెడ్ పై ఉండడంతో ఓ ఏనుగు( Elephant ) చేసిన పని ఇప్పుడు అందరి హృదయాలను దోచుకుంటుంది.వైరల్ అయిన వీడియోలో ఓ ఏనుగు రూమ్ బయట కూర్చుని ఉండగా.ఆ తర్వాత ఆ ఏనుగు మోకాళ్లపై పాకుతూ ఆ గది లోపలికి వచ్చింది.
ఇక తనను చాలా రోజుల నుంచి చూసుకుంటున్న ఓ వృద్ధుడు బెడ్డుపై ఉన్నాడు.తనకే కేర్ టేకర్( Caretaker ) బెడ్ పై ఉండడంతో అతని దగ్గరికి వెళ్ళిన ఏనుగు తన తొండంతో ఆ వ్యక్తి చేతని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది.
ఇక బెడ్ పై ఉన్న వ్యక్తి కూడా చివరి దశలో ఉండడంతో తన ఏనుగు కోసం చేతిని పైకి లేప లేక ఇబ్బంది పడిపోయాడు.దాంతో ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఓ మహిళ అతని చేతిని పట్టుకొని ఏనుగుకు అందించింది.దీంతో ఆ ఏనుగు ఎంతో సంతోషంతో ఉండడంతో అక్కడున్న వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో( Emotional Video ) నెట్టింట వైరల్ గా మారింది.
వీడియో చూసిన నెటిజన్స్.ప్రస్తుత కాలంలో కన్న కొడుకులకు కూడా ఇలాంటి ప్రేమ దోరకడం లేదు అంటూ కామెంట్ చేస్తుండగా.
మరికొందరు ఇలాంటివి కేవలం జంతువులకు మాత్రమే సాధ్యమంటూ కామెంట్ చేస్తున్నారు.