జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సోనీ కార్ప్స్ అనుబంధ చిత్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్( Sony Pictures ) ఎంటర్టైన్మెంట్ సీఈవోగా భారత సంతతికి చెందిన రవి అహుజా ( Ravi Ahuja )బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇప్పటి వరకు టోనీ విన్సీక్వెర్రా సీఈవోగా వ్యవహరించారు.
ప్రస్తుతం సోనీ పిక్చర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న అహుజా (53).వచ్చే ఏడాది జనవరి 2న సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తద్వారా అమెరికన్ ఎంఎన్సీ కంపెనీలకు సారథులుగా వ్యవహరిస్తున్న భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ల లిస్ట్‌లో రవి స్థానం సంపాదించాడు. సోనీ పిక్చర్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం తనకు దక్కిన అదృష్టమని, 100 ఏళ్ల చరిత్ర కలిగిన స్టూడియోకు ఇన్నాళ్లుగా మార్గదర్శకత్వం చేసిన టోనీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

విన్సీక్వెర్రా డిసెంబర్ 2025 వరకు స్టూడియోకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని , రవి అహుజా సోనీ కార్ప్ ఛైర్మన్ కెనిచిరో యోషిడాకు రిపోర్ట్ చేస్తారని కంపెనీ తెలిపింది.2007 నుంచి ఫాక్స్ నెట్వర్స్క్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నాటి నుంచి విన్సీక్వెర్రాతో రవికి మంచి అనుబంధం ఉంది.2021లో అహుజా.సోనీ పిక్చర్స్‌లో చేరాడు.
గ్లోబల్ టెలివిజన్ స్టూడియోస్ ఛైర్మన్‌గా ఇండియాలో వ్యాపారాన్ని కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు.దక్షిణాసియాలో సోనీ ఉనికిని పెంచే లక్ష్యంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌తో సోనీ పిక్చర్స్ ఇండియా విలీనం (తర్వాత రద్దు చేయబడింది)లో రవి కీలకపాత్ర పోషించారు.

ఈ ఎదురుదెబ్బ తగిలినప్పటికీ. సోనీ పిక్చర్స్ కోసం ఇండస్ట్రియల్ మీడియా, బాడ్ వోల్ఫ్, పిక్సో మోండోల కొనుగోలు వ్యవహరాలను రవి విజయవంతంగా పూర్తి చేశారు.పెన్సిల్వేనియా యూనివర్సిటీ ( University of Pennsylvania )నుంచి ఎంబీఏ పట్టా పొందిన అహుజా, గతంలో వాల్ట్ డిస్నీ టెలివిజన్‌లో పనిచేశారు.2019లో ఫాక్స్‌ను డిస్నీ కొనుగోలు చేసిన తర్వాత డీసీ, ఏబీసీ టెలివిజన్, ఫాక్స్ నెట్‌వర్క్‌లను విలీనం చేయడంలో రవి అహుజా కీలకపాత్ర పోషించారు.