మూసి ప్రాజెక్ట్,  హైడ్రా లక్ష్యం ఏంటో చెప్పిన మంత్రి

తెలంగాణ రాజకీయాల్లో మూసి ప్రక్షాళనతోపాటు హైడ్ర వ్యవహారం గందరగోళంగా మారింది.హైడ్రో పేరుతో చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్నారు.

 Telangana Minister Duddilla Sridhar Babu Comments On Hydra And Musi Project, B-TeluguStop.com

అలాగే మూసి సుందరీ కరణ కోసం చేపడుతున్న మార్కింగ్ ప్రక్రియ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో,  తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలకు శుభ్రమైన నీరు , వాయువు అందించడమే మూసీ ప్రాజెక్టు హైడ్రాల లక్ష్యమని శ్రీధర్ బాబు అన్నారు.బీఆర్ఎస్ నేతలు వారు తీసుకున్న నిర్ణయాలను మరిచిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.2017లో బీఆర్ఎస్ హయాంలోని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యిందని శ్రీధర్ బాబు అన్నారు.కాలుష్య నివారణకు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని 2017 లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారని శ్రీధర్ బాబు గుర్తు చేశారు.

Telugu Congress, Duddillasridhar, Hydra, Musi Project, Telangana, Ts-Politics

బీఆర్ఎస్( BRS party ) హయాంలోనే ఆక్రమణలు,  అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో తేల్చాలని చెప్పారు బఫర్ జోన్ బౌండరీల నిర్ధారణ చేయాలని అధికారులను ఆదేశించారు .అక్కడ ఉన్నవారిని  పంపించాలని 2020 లో కేటీఆర్( ktr 0 మంత్రిగా ఉండగా బఫర్ జోన్ నిర్ధారించి ఇళ్లు కూల్చాలని నిర్ణయించారు.2021 లో మరో మీటింగ్ పెట్టి అక్రమ కట్టడాలు కూల్చాలని ఆదేశించారు.2022లో మరో మీటింగ్ పెట్టి నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని చెప్పారు ” అని శ్రీధర్ బాబు( Sridhar Babu ) పేర్కొన్నారు.

Telugu Congress, Duddillasridhar, Hydra, Musi Project, Telangana, Ts-Politics

మూసికి రెండు వైపులా 55 మీటర్లు రోడ్డు వేయాలని, 50 మీటర్లు బఫర్ జోన్ గా గుర్తించాలని 2016 లోనే జీవో 7 తీసుకొచ్చారు .యుద్ధ ప్రాతిపదికన ఇళ్లు కూల్చాలని చెప్పారు.1,50,000 క్యూసెక్కుల కంటే ఒక్క క్యూసెక్ ఎక్కువ వచ్చినా ప్రాణ నష్టం జరుగుతుందని 2019లో ఓ సర్వే తేల్చింది.ఆనాడు మీరు ఆలోచన చేస్తే మంచిది.ఈరోజు మేము మంచి నీరు,  గాలి ఇవ్వాలనుకోవడం తప్పా,  మంచి ఆలోచనతో పని చేపడుతున్నాం.సమస్యను జటిలం చేసేలా బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది.కాలేశ్వరం మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో ఆనాడు మీరు ఎందుకు కనికరం చూపలేదు.

అధికారం పోయి ఏం చేయాలో తోచక బురద చల్లుతున్నారు.కిందిస్థాయి అధికారులు పొరపాట్లు చేస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది.

ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు” అంటూ శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube