వర్షాకాలంలో చర్మం ఎంత డల్‌గా, డ్రైగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పైగా మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగానే ఉంటాయి.
దాంతో వీటిని తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు ఇలా ఎన్నో వాడుతుంటారు.అయితే న్యాచురల్‌గా కూడా చర్మాన్ని రక్షించుకోవచ్చు.
ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కొన్ని కొన్ని ఫ్రూట్ ప్యాక్స్ ట్రై చేస్తే మొటిమలు, మచ్చలు లేకుండా చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుంది.మరి ఆలస్యం చేయకుండా ఆ ఫ్రూట్ ప్యాక్స్ ఏంటో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కివి పండు గుజ్జు, పెరుగు మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గడంతో పాటు చర్మం మాయిశ్చరైజింగ్ గా కూడా ఉంటుంది.
అలాగే అరటి పండు ప్యాక్స్ కూడా ఈ వర్షాకాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ముందుగా ఒక గిన్నెలో బాగా పండిన అరటి పండు గుజ్జు మరియు పుదీనా రసం వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు పట్టించి ముప్పై, నలబై నిమిషాల అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల చర్మం ఫ్రెష్‌గా, కాంతివంతంగా మెరిసి పోతుంది.మరియు మొటిమలు కూడా తగ్గు ముఖం పడతాయి.

ఇక ఆరెంజ్ పండు నుంచి రసం తీసుకుని ఒక బౌల్‌లో వేసుకోవాలి.ఇప్పుడు ఇందులో రోజ్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుని ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి.బాగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే డల్‌గా, డ్రైగా ఉండే ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.