వ‌ర్షాకాలంలో ఈ ఫ్రూట్ ప్యాక్స్ ట్రై చేస్తే..మ‌చ్చ‌ల్లేని మెరిసే చ‌ర్మం మీసొంతం!

వ‌ర్షాకాలంలో చ‌ర్మం ఎంత డ‌ల్‌గా, డ్రైగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.పైగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గానే ఉంటాయి.

దాంతో వీటిని త‌గ్గించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు ఇలా ఎన్నో వాడుతుంటారు.

అయితే న్యాచుర‌ల్‌గా కూడా చ‌ర్మాన్ని ర‌క్షించుకోవ‌చ్చు.ముఖ్యంగా ఈ వ‌ర్షాకాలంలో కొన్ని కొన్ని ఫ్రూట్ ప్యాక్స్ ట్రై చేస్తే మొటిమ‌లు, మ‌చ్చలు లేకుండా చ‌ర్మం నిగ‌నిగ‌లాడుతూ మెరుస్తుంది.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ ఫ్రూట్ ప్యాక్స్ ఏంటో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కివి పండు గుజ్జు, పెరుగు మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి  ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గ‌డంతో పాటు చ‌ర్మం మాయిశ్చ‌రైజింగ్ గా కూడా ఉంటుంది.

అలాగే అర‌టి పండు ప్యాక్స్ కూడా ఈ వ‌ర్షాకాలంలో చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

ముందుగా ఒక గిన్నెలో బాగా పండిన అర‌టి పండు గుజ్జు మ‌రియు పుదీనా ర‌సం వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప‌ట్టించి ముప్పై, న‌ల‌బై నిమిషాల అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ఫ్రెష్‌గా, కాంతివంతంగా మెరిసి పోతుంది.మ‌రియు మొటిమ‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

"""/" / ఇక ఆరెంజ్ పండు నుంచి ర‌సం తీసుకుని ఒక బౌల్‌లో వేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో రోజ్ వాట‌ర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుని ఆ త‌ర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి.

బాగా డ్రై అయిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే డ‌ల్‌గా, డ్రైగా ఉండే ముఖం మృదువుగా, ప్ర‌కాశవంతంగా మారుతుంది.

పుష్ప 2 లో గంగళమ్మ జాతర లో ఫైట్ లో చనిపోయేది ఎవరో తెలుసా..?