తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తనదైన శైలిలో సెటైర్లు వేశారు.తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు , మూసి సుందరీకరణతో పాటు, మంత్రి కొండ సురేఖ వ్యవహారంపై కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అనేక విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసి సుందరీకరణ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని కేటీఆర్ విమర్శించారు.
దేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్ లా వాడుకోవాలని చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. 2400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు( Namami Gange Project ) 40 వేల కోట్లు ఖర్చు అయితే, 55 కిలోమీటర్ల మూసి ప్రక్షాళనకు 1.5 లక్షల కోట్లు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.ఇక మూసి సుందరీకరణ పై మంత్రులకు కేటీఆర్ అనేక ప్రశ్నలు సంధించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని , అప్పుడు వెంకటరెడ్డికి ( Venkata Reddy )మూసి వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారని కెసిఆర్ సెటైర్లు వేశారు. వెంకటరెడ్డికి మూసి గురించి అవగాహన లేదు అని, ఆయనకు ఏం తెలవదు.మూసి పైన ఉన్న సీనరెజి ట్రీట్మెంట్ ప్లాంట్లు పై కూడా అవగాహన లేదని ఎస్టీపీలు పూర్తయిన తర్వాత మూసిలో మురికినీళ్లు ప్రక్షాళన అవుతాయి అని కేటీఆర్ అన్నారు.ఇక కొండ సురేఖ( Konda Surekha ) వ్యవహారం పైన గాటుగా స్పందించారు.
కొండా సురేఖ దొంగ ఏడుగులు, పెడ బొబ్బలు దేనికి ? మా పార్టీ తరఫున ఆమెపై ఎవరూ మాట్లాడలేదు ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా ? కొండా సురేఖ గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి.
ఈ దొంగ ఏనుగులు, పెడబొబ్బలు ఎందుకు ? హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు కొండా సురేఖ చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా ? వాళ్లకు మనోభావాలు ఉండవా ? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా ,? వాళ్ళు ఏడ్వారా .ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అన్ని మీకు మంత్రులకు పంపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటిని పినాయిల్ తో కొండ సురేఖ , మంత్రులు కడగాలి. మూసి సుందరీకరణ ప్రాజెక్టు రిపోర్టు ప్రభుత్వం వద్ద లేదు.డిపిఆర్ గురించి భట్టిని ప్రశ్నిస్తే డిపిఆర్ చూపించలేదు.మూసి కేవలం కాంగ్రెస్ లూటీ కోసమే మూసి .కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంకు లాంటిది. తెలంగాణలో కరువు నివారణ కోసం కాలేశ్వరం ఏర్పడింది .కాలేశ్వరం గురించి అసెంబ్లీలో మూడు గంటలు కేసీఆర్ వివరించారు కాంగ్రెస్ నాయకుడు ఉన్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.