ఇటీవల రోజుల్లో కల్తీ అనేది బాగా పెరిగిపోయింది.చివరకు తినే ఆహారాలను సైతం దారుణంగా కల్తీ చేస్తున్నారు.
మనం రోజు వాడే నెయ్యి కూడా ఇందుకు మినహాయింపు కాదు.నెయ్యిని రోజు వారి వంటల్లో విరివిరిగా వాడుతుంటారు.
నెయ్యిలో అనేక విలువైన పోషకాలు నిండి ఉంటాయి.రోజుకు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి( Ghee ) తింటే బోలెడు ఆరోగ్యాలు లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతుంటారు.
అందుకే చాలా మంది నెయ్యిని తమ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటూ ఉంటారు.

నెయ్యి ఆరోగ్యానికి మంచిదే.కానీ కల్తీ నెయ్యి( Adulterated Ghee )ని తీసుకుంటే మాత్రం లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.కల్తీ నెయ్యిని తయారు చేయడానికి చాలా చెడ్డ పదార్థాలు ఉపయోగిస్తారు.
నూనె, ఉడికించిన బంగాళాదుంపలు వంటి వాటితో కల్తీ నెయ్యిని తయారు చేస్తారు.ఇటువంటి నెయ్యిని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
మరి కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి.? అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు అద్భుతంగా సహాయ పడతాయి.నెయ్యి స్వచ్ఛమైనదా లేక కల్తీదా అన్నది గుర్తు పట్టడానికి ఒక చెంచా నెయ్యిని అరచేతిలో తీసుకోండి.
నెయ్యి కరిగి పోయే దాకా వేచి ఉండండి.మీరు తీసుకున్న నెయ్యి త్వరగా కరిగిపోతే అది స్వచ్ఛమైనది.
కరగడానికి ఎక్కువ సమయం పడితే అది కల్తీది.ఎందుకంటే, నిజమైన నెయ్యి మన శరీర ఉష్ణోగ్రతతో కలిసిన వెంటనే కరుగుతుంది.

అలాగే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి.నెయ్యి వెంటనే కరిగి ముదురు గోధుమ రంగులోకి మారితే అది స్వచ్ఛమైన నెయ్యి.కరిగి, లేత పసుపు రంగులోకి( Yellow Colour ) మారితే అది కల్తీది అని అర్థం.ఇక రెండు స్పూన్ల నెయ్యిలో నాలుగైదు చుక్కల అయోడిన్ కలపండి.
రంగు నీలం రంగులోకి మారితే కాల్తీది అని అర్థం.కాబట్టి ఇకపై నెయ్యి విషయంలో అస్సలు మోసపోకండి.
ఈ సింపుల్ చిట్కాలతో స్వచ్ఛమైన దేశీయ నెయ్యి ఏదో గుర్తించి తీసుకోండి.