టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో ఎన్టీఆర్( Jr ntr ) హీరోగా నటించిన చిత్రం దేవర.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు కొరటాల తెలిపిన విషయం తెలిసిందే.ఇక ఇందులో పార్ట్ 1 తాజాగా విడుదల అయ్యింది.
పార్ట్ 1 కి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.అంటే సూపర్ గా ఉంది అని చెప్పలేము అలాగే బాగోలేదు అని కూడా చెప్పలేము.
రిలీజ్కు ముందు ఉన్న హైప్, బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు కలిసొచ్చి ఈ చిత్రం వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టింది.వీకెండ్ అయ్యాక వసూళ్లు కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయినప్పటికీ గాంధీ జయంతి, దసరా సెలవులు కలిసి రానుండడంతో బాక్సాఫీస్ గండాన్ని గట్టెక్కేస్తుందనే అనుకుంటున్నారు.
సినిమా బ్రేక్ ఈవెన్ కావచ్చు.లేదా బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడవచ్చు.
మొత్తానికి దేవర రిలీజైంది.సానుకూల ఫలితాన్నే అందుకుంటోంది.
మరి దేవర-2( Devara 2 ) సంగతేంటి? అదెప్పుడు వస్తుంది? అసలు వస్తుందా రాదా అనే చర్చ జరుగుతోందిప్పుడు.దేవుడా పార్ట్ వన్ చూసిన తర్వాత దేవర 2 ఎప్పుడు విడుదల అవుతుంది అనే ప్రశ్న అందరిని మెదిలిస్తోంది.
ఏదైనా సినిమాను రెండు భాగాలుగా తీయాలి అనుకున్నపుడు కొందరు రెండో పార్ట్ కూడా కొంత చిత్రీకరణ చేస్తారు.కొందరు తర్వాత చూసుకుందాం అనుకుంటారు.కొందరేమో ముందే రెండో భాగం కూడా తీసేస్తారు.దేవర విషయంలో రెండో భాగం చిత్రీకరణ మొదలే కాలేదని సమాచారం.పార్ట్-1 కోసం తీసిన సన్నివేశాలనే కొంత ఎడిట్ చేసి రెండో భాగం పెట్టుకున్నారట కానీ, కొత్తగా ఇంకో సినిమా తీసినట్లే అన్నీ చేసుకోవాల్సి ఉంది.అయితే తారక్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాలు చేయాల్సి ఉంది.వార్-2 ఆల్రెడీ కొంత చిత్రీకరణ జరుపుకుంది.
నీల్ మూవీ త్వరలోనే మొదలవుతుంది.మరి వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ దేవర 2 సినిమాకు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.తారక్ ఖాళీ లేడు కాబట్టి మధ్యలో కొరటాల వేరే సినిమా ఒకటి చేస 2026లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టే అవకాశముంది.2027 లేదా 2028లో ఈ చిత్రం విడుదల కావచ్చు.అంటే ఈ సినిమా కోసం మరొక నాలుగు ఏళ్ళ పాటు వేచి చూడక తప్పదు మరి.ఇంత గ్యాప్ వస్తే ప్రేక్షకులకు పార్ట్ వన్ సినిమా అసలు గుర్తు ఉండదే అని చెప్పొచ్చు.మరి ఈ విషయం పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.