తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ,( CM Revanth Reddy ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ , కేసిఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని , సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న చర్చపై కేటీఆర్ స్పందిస్తూ… రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు సీఎంగా ఉంటూ ఓపిక కోల్పోయి, రన్నింగ్ కామెంట్రరీ అవసరమా అంటూ ప్రశ్నించారు.
పేమెంట్ కోటాలో సీఎం పదవిని కొట్టేశారు అంటూ విమర్శించవచ్చని అన్నారు. అయ్యల పేరు చెప్పి పదవులు తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారని , ఆయన రాజీవ్ గాంధీని అంటున్నారా, రాహుల్ గాంధీని అంటున్నారో తనకు అర్థం కావడం లేదని కేటీఆర్ సెటైర్లు వేశారు.
దీనిపై వెంటనే స్పందించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరగా . తమపై అసత్య ఆరోపణలు చేస్తే దానికి తగిన సమాధానం చెబుతామని కేటీఆర్ అన్నారు .రేవంత్ స్థాయికి తాము చాలని, కేసిఆర్( KCR ) అవసరం లేదని కేటీఆర్ అన్నారు .సీఎం సత్త తమకు తెలుసని , కాంగ్రెస్ ప్రభుత్వానికి( Congress Government ) సమాధానం చెప్పడానికి తాము సరిపోతామని కేటీఆర్ అన్నారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని , అవగాహన లేకుండా సభను నడుపుతున్నారని, తాము 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపామని, ఎలా నడపాలో చెబుతామని కేటీఆర్ అన్నారు.
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం రేవంత్ కు లేకపోవడంతోనే ఆయన అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ జరుగుతున్న చర్చకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ అన్నారు .తమకు ఎవరితో చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదని , తెలంగాణ ప్రజల పక్షాన తాము పోరాడుతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లను అమలు చేసే వరకు తాము ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడుతామని కేటీఆర్ అన్నారు.