మీ పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపాలో.. ఈ చిట్కాల ద్వారా తెలుసుకోండి..!

పెద్దలకు ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో పిల్లలకు కూడా ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం.దానిని ఎలా సాధించాలనే దానిపైనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు.

 How To Instill Self-confidence In Your Child Know Through These Tips , Your Chil-TeluguStop.com

అయితే ప్రధానంగా పిల్లలకు కావాల్సింది క్రమశిక్షణ, కష్టాలు, డబ్బు లేకుండా పరిస్థితులను ఎదుర్కోవడం, సంస్కారం ఇలా ప్రతి ఒక్కటి కూడా నేర్పించాలి.ఇందులో ప్రధానంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం నేర్పాలి.

అయితే పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని నింపే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల ముందు ఎప్పటికైనా కూడా ప్రతికూల పదాలను వాడకూడదు.ఎందుకంటే అవి పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

ఇక పిల్లలను అధిక కట్టడి చేయకూడదు లేదా భయపెట్టకూడదు.

Telugu Breakfast, Tips, Child-Telugu Health

పరీక్ష సమయంలో కూడా మళ్ళీ మళ్ళీ చదువుకోవాలని, చదువుకోకుంటే ఫెయిల్ అయిపోతారని భయాందోళనకు గురి చేయకూడదు.అంతే కాకుండా కార్యక్రమాలు, సమావేశాల సమయంలో పిల్లలను వేదికపైకి పంపిస్తూ ఉండాలి.అంతేకాకుండా చీకట్లో నడవడం కూడా నేర్పించాలి.

ఆంక్షలు విధించకూడదు.ఇక పిల్లలు చెప్పే మాటలకు తలఊపడం అవస్థలను తెచ్చిపెడుతుంది.

అయితే పిల్లలు అడిగినవన్నీ ఇవ్వడం మానేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇదే అలవాటు పడిపోతుంది.ప్రతిసారి కూడా వారు అడిగేవి ఇవ్వడం వలన మనం ఇవ్వలేని పరిస్థితుల్లో వారు చాలా ఇబ్బందికి గురవుతారు.

ఇక పిల్లలు ఓపిక నేర్చుకునేలా మనకు అవి వద్దు అని వారికి నచ్చచెప్పాలి.

Telugu Breakfast, Tips, Child-Telugu Health

ఇక అవసరానికి మించి గారాబం చాలా ప్రమాదం.ఇక ఉదయం అమ్మ చేసిన అల్పాహారం( breakfast ) గురించి కూడా చాలామంది పిల్లలు చిరాకు పడుతుంటారు.ఇది లేదా అది లేదా అని కోరుకోవడం పిల్లల సాధారణ స్వభావం అని చెప్పవచ్చు.

వారికి కావాల్సిన ఆహారం ఆనందంగా తిననియ్యాలి.బయట దొరికే తినుబండారాలను ప్రోత్సహించకూడదు.

ఇంట్లో ప్రత్యేక ఆహారం శ్రేష్టత గురించి వివరించాలి.పాఠశాలలో పిల్లలు తమ స్నేహితులతో గొడవ పడుతూ ఉంటారు.

ఇది సర్వసాధారణమని చెప్పాలి.అయితే అలాంటి పరిస్థితులలో పిల్లల్ని తగ్గు తీర్చుకోమనడం ఉత్తమం.

వారి స్నేహాన్ని చక్కదిద్దుకోవడానికి తెలివైన మాటలు చెప్పాలి.భవిష్యత్తులో స్నేహితులు, బందువులతో సత్సందాలను కొనసాగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube