అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హారిస్.. తమిళనాడులోని ఆ గ్రామంలో సందడి

అమెరికా చట్ట సభల్లో శాసనకర్తలుగా, స్థానిక ప్రభుత్వాలు, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు ఏకంగా అగ్రరాజ్యానికి రెండో శక్తివంతమైన పదవిని పొందడం నిజంగా ఒక కొత్త శకానికి ఆరంభం.అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి దక్షిణాసియా వాసిగా కమలా హారిస్( Kamala Harris ) చరిత్ర సృష్టించారు.

 Us Vice President Kamala Harris Ancestral Village In India Excited Details, Us V-TeluguStop.com

అంతేకాదు.పరిస్ధితులు అనుకూలంగా వుంటే 2024లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని కూడా ఆమె అధిరోహిస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.

ఈ మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి.అనారోగ్యం, వయోభారం ఇతరత్రా కారణాలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .( Joe Biden ) అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకున్నారు.వెళ్తూ వెళ్తూ తనకు బదులుగా కమలా హారిస్ అభ్యర్ధిత్వానికి మద్ధతు తెలిపారు.

ఆయన బాటలోనే మిగిలిన డెమొక్రాట్ నేతలు, ప్రముఖులు ఆమెకు అండగా నిలుస్తున్నారు.ఈ ఊపు ఇలాగే కొనసాగితే త్వరలో జరగనున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమలా హారిస్‌ను అధ్యక్ష అభ్యర్ధిగా( Presidential Candidate ) ప్రకటించడం లాంఛనమేనని అమెరికన్ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.

Telugu Donald Trump, India, Joe Biden, Kamalaharris, Presidential, Kamala Harris

ఈ నేపథ్యంలో కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని తులసేంద్రపురం( Thulasendrapuram ) వాసుల సందడి మామూలుగా లేదు.చెన్నైకి 300 కి.మీ.వాషింగ్టన్ డీసీకి 14,000 వేల కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.తమ గ్రామ మూలాలున్న బిడ్డ ప్రపంచానికే పెద్దన్న లాంటి దేశానికి అధినేత అయ్యే దిశగా అడుగులు వేస్తుండటంతో తులసేంద్రపురం వాస్తవ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.గ్రామం మధ్యలో కమలా హారిస్‌ ఫోటోతో కూడిన పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేసి ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ స్వీట్లు పంచుకుంటున్నారు.

Telugu Donald Trump, India, Joe Biden, Kamalaharris, Presidential, Kamala Harris

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించాలని కోరుతూ స్థానిక దేవాలయంలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు.కమలా హారిస్, ఆమె తల్లిదండ్రుల పేర్లు గ్రామ దేవాలయానికి విరాళాలు ఇచ్చిన దాతల జాబితాలో ఉన్నాయి.జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం, కమలా హారిస్ రేసులోకి రావడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలను( US Presidential Elections ) గ్రామస్తులు నిశితంగా పరిశీలిస్తున్నారు.కమల తల్లి శ్యామలా గోపాలన్( Shyamala Gopalan ) తల్లిదండ్రులు తులసేంద్రపురానికి చెందినవారు.1958లో అమెరికా వెళ్లడానికి ముందు వరకు శ్యామల తమిళనాడులోనే ఉన్నారు.

Telugu Donald Trump, India, Joe Biden, Kamalaharris, Presidential, Kamala Harris

కాగా, కమలా హారిస్ తాతయ్య పీవీ గోపాలన్‌ భారత స్వాతంత్య్ర సమరయోధుడు.చిన్నతనంలో తరచూ చెన్నై రావడంతో కమలపై తాతగారి ప్రభావం పడింది.నేటికి బహిరంగ వేదికలపై తాతగారు తనకు చెప్పిన మాటలను, ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ వుంటారు.

చెన్నై బీచ్‌లో తాతయ్యతో నడవటంతో పాటు దక్షిణాది సాంప్రదాయ వంటకాలను రుచి చూడటం తనకెంతో ఇష్టమని కమలా హారీస్ అంటూ వుంటారు.తన తల్లి శ్యామల మరణించిన తర్వాత సోదరి మాయతో కలిసి ఆమె చెన్నైకి వచ్చారు.

హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆమె చితాభస్మాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube