జబర్దస్త్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్న అనసూయ ( Anasuya ) అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు.జబర్దస్త్ కార్యక్రమంలో ఈమె స్టార్ యాంకర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక అనసూయకు భారీ స్థాయిలో అభిమానుల సంఖ్య పెరగడంతో ఈమెకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు రావడంతో పూర్తిగా బుల్లితెరకు దూరమవుతూ వెండితెరపై బిజీ అయ్యారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయా లేక బుల్లితెరపై మంచి అవకాశాలు వచ్చాయో తెలియదు కానీ తిరిగి బుల్లితెర కార్యక్రమాలకు కమిట్ అయ్యారు.
![Telugu Anasuya, Pawan Kalyan, Tollywood-Movie Telugu Anasuya, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/pawan-kalyan-movie-Pawan-Kalyan-Special-Song-Tollywood.jpg)
ప్రస్తుతం అనసూయ స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా ఒకవైపు బుల్లితెర పైన మరోవైపు వెండితెర పైన సందడి చేస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని ఈమె తాజాగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![Telugu Anasuya, Pawan Kalyan, Tollywood-Movie Telugu Anasuya, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/pawan-kalyan-movie-Pawan-Kalyan-AnasuyaSpecial-Song-Tollywood.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తాను ఒక చిన్న పాత్రలో నటిస్తున్నానని గతంలో చెప్పిన అనసూయ తాజాగా మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నాను.ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నాను.
నేను పవన్ సర్ తో ఒక బ్యూటీఫుల్ డాన్స్ చేశాను.ఆ పాట మోత మోగిపోతుంది అంటూ ఈమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక ఈమె మోత మోగిపోతుంది అని చెప్పడంతో కచ్చితంగా స్పెషల్ సాంగ్ ( Special Song ) అయ్యి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు కానీ అనసూయ మాత్రం ఏ సినిమాలో పవన్ పక్కన నటించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.