చిట్లిన జుట్టును రిపేర్ చేసే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ ఇదే!

ఆహారపు అలవాట్లు, వాతావరణంలో వచ్చే మార్పులు, కాలుష్యం, రోజు తలస్నానం చేయడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ అధికంగా వినియోగించడం, హెయిర్ ఆయిల్స్ ను ఎవైడ్‌ చేయడం, ఒత్తిడి, త‌డి జుట్టును టైట్‌గా జ‌డ వేసుకోవ‌డం తదితర కారణాల వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటుంది.ఎన్ని సార్లు జుట్టు చివర్లను కత్తిరించినా ఇదే జరుగుతూ ఉంటుంది.దాంతో హెయిర్ గ్రోత్ కూడా ఆగిపోతుంది.

 This Is A Super Powerful Remedy To Repair Damaged Hair , Home Remedy, Damaged Ha-TeluguStop.com

ఈ క్రమంలోనే చిట్లిన జుట్టును ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక మధన పడిపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే చాలా అంటే చాలా సులభంగా చిట్లిన జుట్టును రిపేర్ చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల మినుములు, వ‌న్‌ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మినుములు, మెంతులు వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో వ‌న్ టేబుల్ స్పూన్ మందారం పొడి, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్‌ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

Telugu Damaged, Care, Care Tips, Pack, Remedy, Long, Repair Damaged, Split Ends-

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చిట్లిన జుట్టు నుంచి విముక్తి లభిస్తుంది.

అదే సమయంలో జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube