నువ్వెంత నీ బ్రతుకెంత? ఆర్పీ పై ఫైర్ అయిన బాబు మోహన్?

కిరాక్ ఆర్పీ ( Kirak RP ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాలలో నిలుస్తూ ఉన్నారు.ముఖ్యంగా కూటమికి మద్దతు తెలుపుతూ ఈయన వైసీపీ నేతలపై అలాగే అల్లు అర్జున్ పై చేస్తున్నటువంటి విమర్శలు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

 Senior Actor Babu Mohan Fire On Kirak Rp, Kirak Rp, Jabardasth, Mallemala, Babu-TeluguStop.com

ఇకపోతే ఈయన గతంలో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో సందడి చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేసారు.ఇలా బయటకు వచ్చిన ఆర్పీ మల్లెమాల వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Babu Mohan, Jabardasth, Kirak Rp, Mallemala, Tollywood-Movie

మల్లెమాలవారు కనీసం జబర్దస్త్ ఆర్టిస్టులకు కడుపునిండా కూడా భోజనం పెట్టారని మల్లెమాల వారిపై అసభ్యకర పదాలను ఉపయోగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు స్పందించి ఈయన చెప్పే మాటలన్నీ అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ నటుడు బాబు మోహన్ ( Babu Mohan ) మల్లెమాల వారిపట్ల ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Babu Mohan, Jabardasth, Kirak Rp, Mallemala, Tollywood-Movie

కిరాక్ ఆర్పీ జబర్దస్త్ ( Jabardasth) కార్యక్రమానికి రాకముందు నువ్వెంత నీ బ్రతుకెంత? పొట్ట కూటి కోసమే కదా నువ్వు ఈ కార్యక్రమానికి వచ్చింది.ఈ కార్యక్రమంలో కొంచెం పేరు ప్రఖ్యాతలు రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? నువ్వు విమర్శించింది ఎవరిని మల్లెమాలవారు అంటే ఎవరు చిత్ర సీమకే ఒక తండ్రి MS రెడ్డి గారు.జబర్దస్త్ ను నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి.అలాంటి ఓ గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది.

ఆ సంస్థపై ఆరోపణలు చేయడానికి సిగ్గు లేదా.అన్నం పెట్టే చేయని కొరికితే భవిష్యత్తులో అన్నం దొరకదు.

ఎంతోమందికి పని కల్పించి వారి కడుపు నింపిన ఇలాంటి సంస్థలు బాగుండాలని కోరుకోవాలి.ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం మల్లెమాల వారి సమస్థ అని, వారు అవకాశం ఇవ్వడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ బాబు మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube