నువ్వెంత నీ బ్రతుకెంత? ఆర్పీ పై ఫైర్ అయిన బాబు మోహన్?

కిరాక్ ఆర్పీ ( Kirak RP ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాలలో నిలుస్తూ ఉన్నారు.

ముఖ్యంగా కూటమికి మద్దతు తెలుపుతూ ఈయన వైసీపీ నేతలపై అలాగే అల్లు అర్జున్ పై చేస్తున్నటువంటి విమర్శలు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

ఇకపోతే ఈయన గతంలో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో సందడి చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేసారు.

ఇలా బయటకు వచ్చిన ఆర్పీ మల్లెమాల వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

"""/" / మల్లెమాలవారు కనీసం జబర్దస్త్ ఆర్టిస్టులకు కడుపునిండా కూడా భోజనం పెట్టారని మల్లెమాల వారిపై అసభ్యకర పదాలను ఉపయోగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు స్పందించి ఈయన చెప్పే మాటలన్నీ అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ నటుడు బాబు మోహన్ ( Babu Mohan ) మల్లెమాల వారిపట్ల ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

"""/" / కిరాక్ ఆర్పీ జబర్దస్త్ ( Jabardasth) కార్యక్రమానికి రాకముందు నువ్వెంత నీ బ్రతుకెంత? పొట్ట కూటి కోసమే కదా నువ్వు ఈ కార్యక్రమానికి వచ్చింది.

ఈ కార్యక్రమంలో కొంచెం పేరు ప్రఖ్యాతలు రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? నువ్వు విమర్శించింది ఎవరిని మల్లెమాలవారు అంటే ఎవరు చిత్ర సీమకే ఒక తండ్రి MS రెడ్డి గారు.

జబర్దస్త్ ను నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి.అలాంటి ఓ గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది.

ఆ సంస్థపై ఆరోపణలు చేయడానికి సిగ్గు లేదా.అన్నం పెట్టే చేయని కొరికితే భవిష్యత్తులో అన్నం దొరకదు.

ఎంతోమందికి పని కల్పించి వారి కడుపు నింపిన ఇలాంటి సంస్థలు బాగుండాలని కోరుకోవాలి.

ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం మల్లెమాల వారి సమస్థ అని, వారు అవకాశం ఇవ్వడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ బాబు మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

   .

వామ్మో.. ఒంటికి వ్యాయామం లేకుంటే ఇన్ని సమస్యలు వస్తాయా?