టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు( dil raju, ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు దిల్ రాజు.
కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ ఆయన నిర్మాణ సంస్థ అని చెప్పవచ్చు.కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లోనే మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలు, కాంట్రవర్సీల విషయాల్లో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు దిల్ రాజు.
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) బాలకృష్ణ మినహా అగ్ర హీరోలు అందరితో ఆయన సినిమాలు చేశారు.దీంతో ప్రస్తుతం ఆయన ఆ లోటు తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట నిర్మాత దిల్ రాజు.
ఇందుకోసం కొన్ని కథలను కూడా సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే దిల్ రాజు బాలకృష్ణ( Balakrishna ) కోసం కొన్ని కథలు విన్నారని అందులో బాలయ్య బాబుకు ఏది నచ్చితే ఆ కథతో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు గట్టిగానే టాక్ నడుస్తోంది.
ఈ మధ్య బాలయ్య కథల్ని ఆయన కూతురు తేజస్విని వింటున్నారు.ఆమెకు నచ్చితే ఆ కథ బాలయ్య వరకూ వెళ్తోంది.

బ్రాహ్మణి కూడా కొన్ని కథల్ని విన్నారని, అందులో ఒకటి నచ్చిందని, ఇదే కథ బాలయ్యకు నచ్చితే ఆ సినిమా పట్టాలెక్కడం ఖాయమని ఇన్ సైడ్ టాక్.అయితే ఇప్పుడు బాలయ్యకు కథ చెప్పిన దర్శకుడు ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.దిల్ రాజు బ్యానర్ లో బాలకృష్ణ ఎప్పుడో సినిమా చేయాల్సి ఉంది.అందులో బాలయ్య వందో సినిమా చేయడానికి అప్పట్లోనే దిల్ రాజు గట్టిగా ప్రయత్నించారు.కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు.కానీ ఇప్పుడు మళ్లీ ఇన్ని రోజులకు అవకాశం వచ్చింది.
ఈసారి ఎలాగైనా ఆయనతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలన్న బలమైన కోరికతో ఉన్నారు.