హర్రర్ వీడియో: బోటుపై తిమింగళం అటాక్..!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన అనేక సంఘటనల వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.ఇందులో భాగంగానే తాజాగా అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం నీటిపై ప్రశాంతంగా వెళ్తున్న ఓ బోటు( Boat ) ఉన్నటువంటి గందరగోళానికి గురైంది.

 Whale Slams Into Boat Hurling Two Into Sea Video Viral Details, Whale ,boat, Vir-TeluguStop.com

దీనికి కారణం ఓ భారీ తిమింగలం.అవునండి ఓ భారి తిమింగలం( Whale ) ఉన్నటువంటి ఒక్కసారిగా సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఓ బోటుపై దాడి చేసింది.

బోటుపై దాడి చేసే సమయంలో బోటు కాస్త నీటిలో అల్లాడిపోయింది.అమెరికా దేశంలోని న్యూ హాంప్ షేర్( New Hampshire ) వద్ద సముద్ర జనాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘనంగా సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.మరి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దామా.

న్యూ హాంప్ షేర్ సముద్ర జలాల్లో ఇద్దరు వ్యక్తులు చేపలు వేట కోసం 23 అడుగుల పొడవున్న బోటుతో సముద్రంలోకి వెళ్లారు.అయితే అనుకోకుండా వారు వెళ్లిన బోటు దగ్గరికి ఓ భారీ తిమింగలం వచ్చి చేరింది.అయితే ఉన్నట్లుండి ఆ భారీ తిమింగలం ఒక్కసారిగా బోటుపై ఎగిరి పడింది.దీంతో ఏముంది.అంత భారీ బరువు ఉన్న తిమింగలం ఒక్కసారిగా బోటుపై పడడంతో దెబ్బకు ఆ బోటు నీటిలో పడిపోయింది.ఆ బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఓ వ్యక్తి ముందుగానే సముద్రంలోకి( Sea ) దూకగా మరొకరు తిమింగలం చేసిన పనికి సముద్రంలో పడిపోయాడు మరో వ్యక్తి.

ఈ ఘటన మొత్తాన్ని బోటుకు దగ్గరలో ఉన్న మరో బోటులోని వ్యక్తి వీడియో తీసి అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దాంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఇక ఈ ఘటన జరిగిన తర్వాత తిమింగలం అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సముద్రంలో పడిపోయిన బోటులోని ఇద్దరు వ్యక్తులను అక్కడ ఉన్నవారు కాపాడారు.ఈ ఘటనలో ఇటు మనుషులకి అటు తిమింగలానికి ఎటువంటి హాని జరగలేదు.ఇక అమెరికాలోని ఆ ప్రాంతంలో జూన్ నెల నుండి ఆగస్టు వరకు తిమింగలాల సంచారం ఎక్కువగా ఉంటుందని సమాచారం.అయితే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని అక్కడికొందరు అధికారులు తెలిపారు.

ఈ వీడియో చూసిన చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు.భయ్యా.

మీకు ఇంకా భూమ్మీద బతికే క్షణాలు ఉన్నాయి కాబట్టి బతికిపోయారు లేకపోతే అంత పెద్ద తిమింగలానికి ఆహారం అయిపోయేవారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube