ప్రముఖ తెలుగు నటి భానుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ముద్దుగుమ్మ మంచి నటి మాత్రమే కాదు అద్భుతమైన డ్యాన్సర్ కూడా.వాయిస్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసింది.40 ఏళ్ల కెరీర్‌లో 155 పైగా సినిమాల్లో నటించింది.డైరెక్టర్ వంశీ ఈ నటిని తెలుగు తెరకు పరిచయం చేశాడు.1984లో సితార అనే సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది.“మహల్ లో కోకిల” అనే నవల ఆధారంగా ‘సితార’ సినిమా( Sitara )ని వంశీ రూపొందించాడు.ఈ నవల రాసింది కూడా అతడే కావడం విశేషం.
ఈ మూవీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.ఈ చిత్రం మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను కైవసం చేసుకుంది.
ఇందులోనే అన్ని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి.భానుప్రియఈ సినిమాలో సితార లేదా కోకిల అనే పాత్ర పోషించింది.
ఈ పాత్రకు సూట్ కావాలని రెండు నెలల పాటు భానుప్రియకు పసుపు రాశారట.ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ M.V.రఘు( MV Raghu ) ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ “భానుప్రియ( Bhanu Priya ) క్యారెక్టర్ అనేది ఎండపడని ఒక మహల్‌లో ఉండే మహారాణి పాత్ర.పైగా భానుప్రియ ఈ సినిమాలో శరత్ బాబు చెల్లెలుగా నటిస్తుంది.శరత్ బాబు ఎంత అందగాడో మనం స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.ఆయన తెల్లగా ఉంటాడు.అలాంటి వ్యక్తికి సిస్టర్ నల్లగా ఉంటే వేరే రకాల అర్థాలు వస్తాయి.ఆమె మహల్‌లో ఉండే మహారాణి అంటే కూడా ఎవరూ కన్విన్స్ అవ్వరు.
కథకు తగినట్లు సీతార లేదా కోకిల పాత్ర పోషించే నటి మైనపు బొమ్మలా చాలా అందంగా ఉండాలని నేను అనుకున్నాను.ఆమెను తమిళ సినిమాలో చూసి నేను కొంచెం వర్క్ చేయాలని భావించా.
అదే విషయాన్ని వంశీ కూడా చెప్పాను నిజానికి వంశీకి నలుపు అంటే చాలా ఇష్టం.అయినా నా మాట విని ఆమెను పిలిపించి రెండు నెలల పాటు పసుపు రాసుకుని రెండు గంటలు అలాగే ఉంచాలని కోరారు.ఆమె రోల్‌కు అది అవసరమని అర్థం చేసుకుని అలాగే చేసింది.” అని సినిమాటోగ్రాఫర్ రఘు వివరించాడు.

షూటింగ్ కి రెండు నెలల ముందు నుంచి డైలీ పసుపు రాసుకోవడం వల్ల నల్లగా ఉన్న ఆమె కాస్త రంగు వచ్చిందని కూడా రఘు వెల్లడించాడు.అలా సాధ్యమవుతుందా అంటే “మేకప్ వేసుకోవడం వల్ల చాలామంది నటులు రంగు మారారు.పసుపు, మేకప్స్ లాంటి వాటి వల్ల రంగు మారడం సాధ్యమవుతుంది.” అని తెలిపాడు.భానుప్రియ కొంచెం రంగు వచ్చిన తర్వాత ఆమెకు స్పెషల్ మేకప్స్ వేయించి ఫోటో దింపాడు రఘు.అనంతరం ఆమె షూటింగ్ కి ఇదే మేకప్ లో రావాలని మేకప్ మ్యాన్ కు చెప్పాడు.అలా సితార సినిమాలో భానుప్రియ లుక్ కోసం రఘు చాలా కష్టపడ్డాడు.