నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party )ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన ఢిల్లీలోని జంతర్ మంతర్( Jantar Mantar in Delhi ) వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమం అనుకున్న మేరకు సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, అనేకమంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, అనేకమంది పై కేసులు నమోదయ్యాయని, ఈ వేధింపులకు నిరసనగా జాతీయ స్థాయిలో ఏపీ వ్యవహారాలను హైలెట్ చేసేందుకు జగన్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఆహ్వానించారు.సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్( Samajwadi Party leader Akhilesh Yadav ) , శివసేన ( ఉద్ధవ్ థాకరే వర్గం ) నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది , తృణమూల్ కాంగ్రెస్ నేత నదిమూల్ హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు వైసిపికి మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తమ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.ఏపీలో జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు వంటి వాటిపై జాతీయస్థాయిలో తాము ఉద్యమిస్తామని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.వైసిపి నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం సక్సెస్ కావడంపై టీడీపీ కూటమి ( TDP )కూడా ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ఢిల్లీకి బయలుదేరి వెళుతుండడం ఆసక్తికరంగా మారింది.
శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ కూడా విడుదలైంది.
ఈనెల 27వ తేదీన ఢిల్లీలో ఏర్పాటు అయ్యే నీతి అయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ను కూడా చంద్రబాబు కలవనున్నారట. వైసీపీ నిర్వహించిన ఆందోళనకు జాతీయస్థాయిలో మద్దతు లభించడం, లోక్ సభ లో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన తరువాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తుండడం వంటివి చర్చనీయాంశం గా మారాయి.