వైసీపీ ధర్నా సక్సెస్ … ఢిల్లీకి టూర్ కి బాబు

నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party )ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన ఢిల్లీలోని జంతర్ మంతర్( Jantar Mantar In Delhi ) వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమం అనుకున్న మేరకు సక్సెస్ అయ్యింది.

  చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని,  అనేకమంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని,  అనేకమంది పై కేసులు నమోదయ్యాయని, ఈ వేధింపులకు నిరసనగా జాతీయ స్థాయిలో ఏపీ వ్యవహారాలను హైలెట్ చేసేందుకు జగన్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

  దీనికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఆహ్వానించారు.సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్( Samajwadi Party Leader Akhilesh Yadav ) , శివసేన ( ఉద్ధవ్ థాకరే వర్గం ) నాయకుడు సంజయ్ రౌత్,  ప్రియాంక చతుర్వేది , తృణమూల్ కాంగ్రెస్ నేత నదిమూల్ హక్,  ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు వైసిపికి మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"""/" / తమ నిరసన కార్యక్రమానికి మద్దతు  తెలిపిన వారందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో జరుగుతున్న దాడులు,  హత్యలు,  అత్యాచారాలు వంటి వాటిపై జాతీయస్థాయిలో తాము ఉద్యమిస్తామని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

వైసిపి నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం సక్సెస్ కావడంపై టీడీపీ కూటమి ( TDP )కూడా ఆరా తీసింది.

  ఈ నేపథ్యంలోనే టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ఢిల్లీకి బయలుదేరి వెళుతుండడం ఆసక్తికరంగా మారింది.

శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు.  దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ కూడా విడుదలైంది.

"""/" / ఈనెల 27వ తేదీన ఢిల్లీలో ఏర్పాటు అయ్యే నీతి అయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ను కూడా చంద్రబాబు కలవనున్నారట.

  వైసీపీ నిర్వహించిన ఆందోళనకు జాతీయస్థాయిలో మద్దతు లభించడం,  లోక్ సభ లో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన తరువాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తుండడం వంటివి చర్చనీయాంశం గా మారాయి.

ఆ సినిమాను వదిలేసినందుకు ప్రభాస్ ఇప్పటికి బాధపడుతూ ఉంటాడా..?