నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ యూనివర్సిటీలో అందుబాటులోకి ఎన్ఆర్ఐ కోటా

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ యూనివర్సిటీలో ( Nanaji Deshmukh Veterinary University )చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్ధులకు శుభవార్త.ఈ వర్సిటీ కొత్తగా ఎన్ఆర్ఐ కోటాను ప్రవేశపెట్టింది.

 Nanaji Deshmukh Veterinary University Introduces Nri Quota For Foreign Students-TeluguStop.com

అంతర్జాతీయ విద్యార్ధులకు ఈ సంస్థ నేరుగా ప్రవేశాలను అనుమతిస్తుంది.విదేశీ విద్యార్ధులకు భారతదేశంలో వెటర్నరీ సైన్స్‌లో విద్యను అభ్యసించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిపుణులు చెబుతున్నారు.

ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఈ కొత్త ప్రక్రియను ఆమోదించింది.

Telugu Nanajideshmukh, Nri Quota, Window System-Telugu Top Posts

సింగిల్ విండో సిస్టమ్( Single window system ) ద్వారా దీనిని అమలు చేయనున్నారు.అంటే విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.యూనివర్సిటీ పరిధిలోని మూడు ప్రభుత్వ వెటర్నరీ కాలేజీలకు సైతం ఎన్ఆర్ఐ కోటా వర్తిస్తుంది.

బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ , బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్( Bachelor of Veterinary Science, Bachelor of Fisheries Science ) కోర్సుల్లో ఎన్ఆర్ఐ, విదేశీ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా 34 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.ఈ సీట్లన్నీ ప్రభుత్వ వెటర్నరీ కాలేజీల్లోనే ఉన్నాయి.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్ట్ 31.ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఈ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలి.ఈ సీట్లు జబల్‌పూర్‌లోని వెటర్నరీ కాలేజీ, మహూలోని వెటర్నరీ సైన్స్, యానిమల్ హజ్బెండరీ కాలేజీ, రేవా కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి.

Telugu Nanajideshmukh, Nri Quota, Window System-Telugu Top Posts

నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీకాంత్ జోషి( Dr.Srikanth Joshi ) మాట్లాడుతూ.సింగిల్ విండో విధానంలో దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ వ్యవస్థ విద్యార్ధులకు అడ్మిషన్ల విషయంలో గందరగోళాన్ని నివారించడానికి రూపొందించినట్లు చెప్పారు.ఎన్ఆర్ఐ , విదేశీ కోటా సీట్లను చేర్చాలని అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించిందని డాక్టర్ జోషి పేర్కొన్నారు.

ఎక్కువ మంది విదేశీ విద్యార్ధులను విశ్వవిద్యాలయం వైపు ఆకర్షించడం, విద్యా వాతావరణాన్ని సుంపన్నం చేయడం , సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం ఈ నిర్ణయం తీసుకున్నారు.వర్సిటీ నిర్ణయంపై ఎన్ఆర్ఐ, విదేశీ విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube