ఉల్లి-వెల్లుల్లి కలిపి ఇలా తీసుకుంటే గొంతు నొప్పి దెబ్బకు పరార్ అవుతుంది!

ప్రస్తుత వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో గొంతు నొప్పి( sore throat ) ఒకటి.వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చాలా మంది గొంతు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు.

 Taking Onion And Garlic Together Will Reduce Sore Throat! Sore Throat, Sore Thro-TeluguStop.com

గొంతు నొప్పి కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.తినడానికి, తాగడానికి చివరకు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే సీజనల్ గా వచ్చే గొంతు నొప్పిని ఎటువంటి మందులతో సంబంధం లేకుండా సహజంగానే తగ్గించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక చిన్న ఉల్లిపాయను( onion ) తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు( Garlic cloves ) పొట్టు తొలగించి తురుముకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Telugu Garlic, Tips, Latest, Sore Throat, Garlicreduce, Throat Pain-Telugu Healt

వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు వెల్లుల్లి తురుము వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) మరియు హాఫ్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.

Telugu Garlic, Tips, Latest, Sore Throat, Garlicreduce, Throat Pain-Telugu Healt

ఈ విధంగా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కనుక చేశారంటే గొంతు నొప్పి దెబ్బకు పరారవుతుంది.ఉల్లి వెల్లుల్లి తో తయారుచేసిన ఈ డ్రింక్ బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది.గొంతు నొప్పిని చాలా వేగంగా తగ్గిస్తుంది.

అంతేకాదు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే వాటిని సైతం దూరం చేస్తుంది.శ్వాసకోశ లో ఏర్పడిన అడ్డంకులను తొలగిస్తుంది.

కాబట్టి ప్రస్తుత వర్షాకాలంలో గొంతు నొప్పితో బాధపడుతుంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న మ్యాజికల్ డ్రింక్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube