సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం బండమీద చందుపట్ల గ్రామంలో గత కొన్ని నెలల నుండి పేరుకుపోయిన మురికి కాలువను పూడిక తీయడంలో గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శిలు నిర్లక్ష్యం వహించడంతో కలువ నుండి వచ్చే దుర్గంధాన్ని భరించలేక పరిసర ప్రాంతాల ప్రజలే పారిశుద్ధ్య కార్మికులుగా అవతారమెత్తి కాలువ పూడిక తీసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.ఈ సందర్భంగా చైతన్య యుజన మండలి అధ్యక్షులు బాషిపంగు సునీల్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీ పాలక మండలి పట్టించుకోక పోవడంతో మురికి కాలువలు మురికి కూపాలుగా మారి పక్కన నివసిస్తున్న ప్రజలకు దుర్వాసన వెదజల్లి,దోమల బెడద విపరీతంగా ఉండడంతో చేసేది ఏమీ లేక ఆ ప్రజలే మురికి కాలువను పూడిక తీసుకుంటున్నారన్నారు.
గ్రామంలో ఇలాంటి పరిస్థితి చాలా వీధుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నగ్రామ పంచాయితీ సర్పంచ్,సెక్రటరీపై ప్రభుత్వం అధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.