విచ్చలవిడిగా నాటుసారా కేంద్రాలు...!

సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని పలు గ్రామాల్లో,తండాల్లో గుడుంబా వాసన గుప్పుమంటుంది.నాటు సారా తయారీకి కావలసిన నల్ల బెల్లం మొత్తం తండాల నుండి సరఫరా అవుతున్నట్లు,దీనికి పలు శాఖల అధికారులు గుట్టుగా సహకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 Natu Sara Centers In Mothe Mandal,natu Sara Centers ,mothe Mandal, Natu Sara Sal-TeluguStop.com

ఎక్సైజ్ అధికారులు గుడుంబా అమ్మకంపై అడపాదడపా దాడులు చేస్తున్నా కట్టడి చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.మద్యం ధరలు విపరీతంగా పెరగడం, నాటుసారా అమ్మకాలు జోరుగా సాగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు సారాకు బానిసై ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా రోజురోజుకు చితికిపోతున్నారని బాధిత కుటుంబాల మహిళలు వాపోతున్నారు.

గుడుంబా తయారీ,అమ్మకం మూలాలపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా దృష్టి పెట్టక పోవడంతోనే యధేచ్చగా గుడుంబా ఏరులై పారుతోందని అంటున్నారు.మోతె మండలంలో గుడుంబా విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని మండల ప్రజలు బహిరంగంగానే మండిపడుతున్నారు.

అప్పుడప్పుడు దాడులు చేస్తున్న వాటి మూలాలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.గుడుంబా కేంద్రాలను సమూలంగా నిర్మూలిస్తేనే పేద, మధ్యతరగతి కుటుంబాలు బయట పడతాయని,ఇప్పటికైనా గుడుంబాపై సంబంధిత అధికారులు ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube