వర్షాకాలంలో ఆరోగ్యంగా తినడం, ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిది.ఈ సీజన్ లో జలుబు, ఫ్లూ, అలర్జీ( Cold, flu, allergy ) ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
అందువల్ల ఈ సీజన్ లో ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ఎంతో ముఖ్యం.వర్షాకాలంలో ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నూనెతో కూడిన స్పైసీ ఫుడ్స్( Spicy foods ) తినకుండా ఉండడం ఎంతో మంచిది.
ఈ రకమైన ఆహారంలో కొవ్వు, నూనె ( Fat, oil )ఎక్కువగా ఉంటుంది.ఇది ఆరోగ్య సమస్యలను పెంచే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తినకుండా ఉండడమే ఎంతో మంచిది.ఎందుకంటే ఇందులో ఫుడ్ పాయిజనింగ్ కారణమయ్యే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా( Microorganisms, bacteria ) ఎక్కువగా ఉంటాయి.
అలాగే వేయించిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం కావు.
ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి.వర్షాకాలంలో ఫిట్ గా ఉండేందుకు కొన్ని ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో ఆహారంలో పండ్లు, కూరగాయలను( Fruits , vegetables ) ఎక్కువగా చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.పండ్లు కూరగాయలలో విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.నారింజ, ఆపిల్, ద్రాక్ష, మామిడి వంటి పండ్లు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే ఈ పండ్లలో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
శరీరంలో మంటను తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
అదే విధంగా బచ్చలి కూర,( spinach )ముదురు ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి.ఎందుకంటే అవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ముఖ్యంగా చెప్పాలంటే వర్షాకాలంలో సూప్ లు, హెర్బల్ టీలు వంటి వేడి పానీయాలను తీసుకుంటూ ఉండాలి.
ఎందుకంటే వేడిగా ఉండే పానీయాలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.గ్రీన్ టీ చమోమిలే టీ వంటి హెర్బల్ టీలు యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.
ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.ఇంకా చెప్పాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా వర్షాకాలంలో తీసుకుంటూ ఉండాలి.