సమగ్రాభివృద్ధికై మరోపొరాటం తీవ్రం చేద్దాం:ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం,అభివృద్ధికోసం మరోపోరాటం చేయాలని చెప్పిన తెలంగాణ జాతిపిత స్పూర్తితో సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం,అవినీతి రాజకీయాలను ప్రారద్రోలుట కొరకు పోరాటం తీవ్రం చేద్దామని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి ధర్మార్జున్ పిలుపునిచ్చారు.జయశంకర్ సర్ జయంతి సందర్భంగా తెలంగాణ జనసమితి నిర్వహిస్తున్న జనసమితి జనచైతన్య యాత్రను స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు.

 Let's Take Another Step Towards Comprehensive Development: Dharmarjun-TeluguStop.com

ఈ సందర్భంగా ధర్మార్జున్ మాట్లాడాతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మనవనరులన్నింటిపై మనకే హక్కుంటది.మనరాష్ట్ర బడ్జెట్ ను మనమే నిర్ధేశించుకుని గ్రామ స్థాయినుండి రాష్ట్ర స్థాయివరకు మనమే ప్రణాళికలు రూపొందించుకొని,ప్రజలు కేంద్రంగా నిర్మాణాత్మక అభివృద్ది ప్రణాళికలు రూపొందించుకుంటామని కలలుగన్నాం.

ప్రతి తెలంగాణ బిడ్డకు విద్య,వైద్యం,ఉద్యోగ ఉపాధి కల్పనతో ఆత్మగౌరవంతో కూడిన నిలకడగలిగిన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవచ్చని సకల జనుల మేకమై కొట్లాడినం.ఒక వైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేస్తూనే మరోవైపు సాధించుకున్న రాష్ట్రాన్ని ఎలా నిర్మించు కోవాలనే అభివృద్ధి ప్రణాళికలపై చర్చలు జరిగినవి.వీటన్నింటినీ2014 ఎన్నికల్లో ప్రజా మ్యానిఫెస్టోగా చర్చించినం.కొత్త జిల్లాల ఏర్పాట్లు, ప్రతిజిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్,యునివర్సిటీ, యువతకు స్థానికంగా ఉపాధి కల్పన ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నాం.

మారుతున్న,పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గ్రామాలు పట్టణాలను నిర్మించుకోవాలనుకున్నాం,సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించుకొని అన్నీపంటలను పండించు కొని మార్కెటింగ్ చెయ్యాలనుకున్నాం.ఏకకాలంలో రుణమాఫీ చేసుకుంటే రైతులకు కొంత వెసులుబాటు ఉంటది రైతు స్వశక్తితో నిలదొక్కుకుంటాడు అనుకున్నాం.

ఈ తెలంగాణ ఉద్యమ డిమాండ్లన్ని గమనించిన టి ఆర్ ఎస్ పార్టీ వీటి తోపాటు ఎన్నో హామీలనిచ్చిoది అర్హులఅందరికి డబుల్ బెడ్ రూమ్ లు ప్రతి ఊరికి సాగు త్రాగు నీరు అందిస్తానని చెప్పింది.ప్రతి పంటను అమ్ముకునే అవకాశాన్ని మెరుగు పర్చుతానంది.

దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానంది.అధికారంలోకి రాగానే ఉద్యమ ఆకాంక్షలనే అమలుచేస్తున్నట్లుప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిందని దర్మార్జున్ విమర్శించారు ప్రాజెక్ట్ ల రీ డిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచి కాంట్రాక్టర్లతో చేతులు కలిపి పెద్దఎత్తున ప్రజసొమ్మును దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు ఆరోపించారు.

గతంలో ప్రజలు పోరాటం చేసి వివిధ ప్రభుత్వ స్కీంలలో దళితులు సాదిoచుకున్న భూములను సైతం గుంజు కుంటున్నారని ధర్మార్జున్ విమర్శించారు.సూర్యాపేట పట్టణంలో సమస్యలు పరిష్కరించక పోగా సరికొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ధర్మార్జున్ అన్నారు.

వివిధ కుంటి సాకులతో సూర్యాపేట సద్దలచెరువును కుదించి తాళ్ళగడ్డను కూడా నీటముంచారు.సద్దల చెరువు సుందరీకరణ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు సాగదీస్తూ అవినీతి డ్రైనేజ్ గా మార్చారు.

ముందస్తు ప్రణాళిక లేకుండా హడావుడిగా మెయిన్ రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసం చేశారు.సూర్యాపేట వ్యాపారాన్ని నాశనం చేశారుఅని ధర్మార్జున్ విమర్శించారు.

ఆటోనగర్ నిర్మాణము అంటూ పాలా భిషేకాలు చేయించుకున్నారు తప్ప అడుగు ముందుకు పడిందిలేదుఅని ఎద్దేవాచేశారు.మున్సిపల్ శివారు, విలీన బజార్లు అభివృద్ధికి నోచుకోక సమస్యలతో కొట్లాడుతున్నవిఅన్నారు.

గత శాసనసభ్యుల వైఫల్యంతో నేటి శాసన సభ్యుని ప్రణాళికా రాహిత్యంతో బాధ్యతారాహిత్యం తో సూర్యాపేట నియోజక వర్గం అభివృద్ధిలో వెనక పడి పోతుందని ఆవేధన వ్యక్తం చేశారు.ప్రజాభివృద్ది కేంద్రంగా కాకుండా నాయకుల అభివృద్ధి కేంద్రంగా చేసుకుని ప్రజలను గాలికి వదిలేసిన ఈ అవినీతి రాజకీయాల మార్పు లక్ష్యంగా సూర్యాపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధిని కోరుతూ తెలంగాణ జనసమితి జనచైతన్య యాత్రను నిర్వహిస్తుందని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ సమితి విజయం సాధించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గట్లరమాశంకర్,జిల్లా అధ్యక్షుడు మాండ్ర మల్లయ్య,యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాబోయిన కిరణ్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షుడు కంబాలపల్లి శ్రీను,లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ కుంచం చంద్రకాంత్,నాయకులు ప్రకాష్,విద్యార్ధి సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్,పట్టణ పార్టీ అద్యక్షుడు బందన్ నాయక్,ప్రధాన కార్యదర్శి పగిల్ల శ్రీను,ఉపాధ్యక్షుడు బీసుస్వామి ఆత్మకూరు మండల అధ్యక్షుడు కొల్లు కృష్ణారెడ్డి,చివ్వెంల మండల ప్రధాన కార్యదర్శి సుమన్, ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దేవత్ సతీశ్ యువజన సమితి నాయకులు యాకూబ్ రెడ్డి, హరీష్,మైనార్టీ సెల్ నాయకులు ఖలీల్,ఫరీద్, దొన్వాన్ కృష్ణ,నాగరాజు,శివ రఫీ,సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు యాత్ర 31,32,16వ వార్డుల్లో నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube