ఈ ఆహార పదార్థాలతో బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్..!

ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.సాధారణంగా మహిళలు, ముఖ్యంగా తల్లులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.

 Best Foods For Avoiding Breast Cancer Details, Health Care, Health Tips, Healthy-TeluguStop.com

తమ శరీరంలో వచ్చే మార్పులు గమనించక వాటిని మురుగ పెడుతుంటారు.అయితే ఇలా నిర్లక్ష్యం చేసే మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడేవారే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

ఒకవేళ ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడితే.కొన్ని ఆహార పదార్థాలు డైట్ లో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఎర్లీ స్టేజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నా లేదా అంతకన్నా తీవ్రమైన బెస్ట్ క్యాన్సర్ వ్యాధితో సతమతమవుతున్నా.పోషక విలువలుండే ఆహార పదార్థాలను తినాలి అంటున్నారు.

ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

ముఖ్యంగా మన రక్తాన్ని పలుచగా చేసి ఎక్కడా కూడా రక్తపు గడ్డలు లేకుండా వెల్లుల్లి చేయగలదు.అందుకే దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వ్యాధి త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది.

వెల్లుల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుందని అధ్యయనాలు కూడా తేల్చాయి.కెరొటినాయిడ్స్‌ అధికంగా ఉండే క్యారెట్‌, చిలకడ దుంప, బొప్పాయి, టొమాటోలను తరచూ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటి కూరగాయల్లో వ్యాధితో పోరాడే శక్తిని మన శరీరానికి అందించే బయో యాక్టివ్‌ కాంపౌండ్స్‌ ఉంటాయి.

Telugu Breast Cancer, Fiber, Foodsbreast, Foods Tobe, Ghee, Greenleafy, Care, Ti

పసుపులో ఉండే ఫైటో కెమికల్‌ రొమ్ము క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించగలదు.బ్లాక్‌ టీ, ఉల్లిపాయ వంటి పదార్థాల్లో ఉండే ఫ్లవనాయిడ్స్‌ ఫ్రీరాడికల్స్‌ తగ్గించి వ్యాధి నుంచి రక్షిస్తాయి.స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో కూడా సవాలక్ష వ్యాధులను తగ్గించే ఔషధాలు ఉంటాయి.

ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడే వారు ఆవునెయ్యిని తమ ఆహారంలో విరివిగా వాడితే చాలా మంచిది.

Telugu Breast Cancer, Fiber, Foodsbreast, Foods Tobe, Ghee, Greenleafy, Care, Ti

విటమిన్-సి పుష్కలంగా ఉండే పండ్లు, పీచు అధికంగా ఉండే ధాన్యాలు రెగ్యులర్ గా తినాలి.అలాగే చక్కెర వంటి తీపి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.సహజమైన పండ్లలో లభించే చక్కెర మన శరీరానికి ఎలాంటి హాని చెయ్యదు.

కానీ శుద్ధిచేసిన చక్కెర వల్ల ఆరోగ్యం నాశనం అవుతుంది.పైన పేర్కొన్న ఆహార పదార్థాలను తరచుగా తినడం ద్వారా రొమ్ము క్యాన్సర్ తగ్గించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube