నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ ని సస్పెండ్ చేయండి...!

నల్లగొండ జిల్లా: మూడు నెలలు గడిచినా మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా మున్సిపల్ యాక్ట్ ను నిర్వీర్యం చేస్తున్న నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

 Suspend Nakirekal Municipal Chairman, Suspend, Nakirekal Municipal Chairman, Nak-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలక వర్గం ఏర్పాడి దాదాపు ఇరవై రెండు నెలలు గడిచినా కేవలం తొమ్మిది సార్లు మాత్రమే సర్వసభ్య సమావేశం నిర్వహించారని అన్నారు.మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం నెలకొకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించవలసిన ఉన్నా, దాదాపుగా మూడు నెలలు గడిచినా నిర్వహించక పోవడం ఏమిటని ప్రశ్నించారు.

ఇటివల కాలంలో మున్సిపాలిటీ పరిధిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కమీషన్లు తీసుకున్నారని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ పై తిరుగుబాటు చేయడంతో వారిని బుజగించేందుకు గోవా ట్రిప్పుకు తీసుకెళ్లారని అన్నారు.పాలనను గాలికొదిలి పంపకాలపై దృష్టి పెట్టి, ప్రజలను పట్టించుకోని చైర్మన్ కు మున్సిపల్ కమిషనర్ కూడా వంత పాడుతూ ఉన్నారని,ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫిర్యాదు చేసిన వారిలో వంటెపాక సోమలక్ష్మి, పన్నాల పావని,చెవుగోని రజిత,యాసారపు లక్ష్మి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube