మల్లు స్వరాజ్యం డిజిటల్ మ్యూజియం

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం యాదిలో రూపొందించిన మల్లు స్వరాజ్యం డిజిటల్ మ్యూజియం (వెబ్ సైట్) ను సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శనివారం జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం జ్ఞాపకాలను,ఆమె నిర్వహించిన పోరాటాల చిత్రాలు,వీడియోలను వెబ్ సెట్ ద్వారా ప్రజలకు అందించడం స్ఫూర్తిదాయకం అన్నారు.

 Mallu Swarajyam Digital Museum-TeluguStop.com

ఈ వెబ్ సైట్ ద్వారా మల్లు స్వరాజ్యం నిర్వహించిన ఉద్యమాలను, పోరాటాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు మల్లు స్వరాజ్యం మనుమడు డాక్టర్ మల్లు అరుణ్ డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube