'సర్కారు వారి పాట' పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్.. ఫ్యాన్స్ థియేటర్ లో డ్యాన్స్ వేయడం పక్కా.. ఎస్.ఎస్. తమన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.సంగీత సంచలనం ఎస్.

 Music Director Ss Thaman Interview On Mahesh Babu Sarkaru Vaari Pata Movie Detai-TeluguStop.com

ఎస్.తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ వున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.తాజాగా ‘సర్కారు వారి పాట’ మ్యూజికల్ సెన్సేషన్ తమన్ మీడియాతో ముచ్చటించారు.ఆయన పంచుకున్న ‘సర్కారు వారి పాట’ విశేషాలు…

ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి పని చేయడంలో లాభ నష్టాలు ఎలా వుంటాయి ?

భారీ అంచనాలు వుండటం ఒక ఇష్యూ.ఆ అంచనాలు అందుకోవడం కోసం ఏదైనా స్పెషల్ స్కూల్ వుంటే బావున్ననిపిస్తుంటుంది.మ్యూజిక్ చేయడమే కాకుండా దాన్ని చక్కగా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా ఒక భాద్యతగా మారింది.

చెవులకి మాత్రమే కాదు మేము కూడా కనిపించాల్సిన తప్పనిసరి పరిస్థితిలోకి వచ్చేశాం.ఒకసారి చేశాం.

,, ఇప్పుడది అలవాటు గా మారిపోయింది.

Telugu Parashuram, Heorinekeerthy, Mahesh Babu, Kalaavathi, Music, Sarkaruvaari,

లిరికల్ వీడియోకి కూడా భారీగా ఖర్చు పెట్టడం మీతోనే మొదలైయింది కదా ?

ఆడియో కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.పాట బాలేకపోతే వారు పెట్టుబడి పెట్టరు.వాళ్లకి కూడా కొన్ని లెక్కలు, టీమ్ వుంటుంది.

అందరూ అప్రూవ్ చేయనిదే అంతంత బడ్జెట్లు రావు.పెట్టుబడికి తగిన రాబడి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు.150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు.సినిమాలే కాదు పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి.

ఒక పాట రీచ్ అవాలంటే.అది గ్లోబల్ గా ఉందా ? ఎవరు పాడుతున్నారు ? ఇలా చాలా అంశాలు వుంటాయి.ఈ భాద్యతలన్నీ తీసుకోవాల్సివస్తుంది.

ఇది వరకూ పాట స్లోగా హిట్టు అయ్యే పరిస్థితి వుండేది.కానీ ఇప్పుడన్నీ ఇన్స్టెంట్ హిట్స్ వస్తున్నాయి కదా .?

ఇది వత్తిడితో కూడుకున్న వ్యవహారమే.మంచి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే , అంచనాలు, వత్తిడి ని భరించగలడా ? అనేది కూడా చూస్తున్నారు.దర్శకుడు, హీరో, ఫ్యాన్స్ .ఇలా అందరూ మ్యూజిక్ తప్పు ఒప్పులు చెబుతుంటారు.దీంతో పాటు మిగతా భాషల పాటలతో కూడా పోటీ వుంటుంది.

అయితే ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వుంటే మంచిది.ఈ వత్తిడి కూడా ఓ మంచి పాటని ఇవ్వడానికి అడ్వాంటేజ్ గా వుంటుంది.

Telugu Parashuram, Heorinekeerthy, Mahesh Babu, Kalaavathi, Music, Sarkaruvaari,

మల్టీ ప్రాజెక్ట్స్ చేస్తూ, అంచనాలు అందుకోవడం సాధ్యమా ?

చాలా కష్టం.దిని కోసం బ్రెయిన్ తో పాటు పరిగెత్తాలి.అయితే ఇప్పుడు మంచి విషయం ఏమిటంటే.డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తున్నాయి.దీంతో ఒకేలా కాకుండా డిఫరెంట్ గా అలోచించే అవకాశం వుంది.జోనర్స్ మారడం వలన మ్యూజిక్ కూడా డిఫరెంట్ జోనర్స్ లో వస్తుంది.

సర్కారు వారి పాట విషయానికి వస్తే ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా.సినిమా మొత్తం స్పార్క్ తగ్గనే తగ్గదు.

సినిమా అంతా షైనింగ్ కనిపిస్తూనే వుంటుంది.సర్కారు వారి పాట పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్.


ట్యూన్ బావుంటే ఆటోమేటిక్ కన్విన్స్ అవుతారా ? లేదా వేరే పద్దతి వుంటుందా ?

మేము ఎన్ని ట్యూన్స్ అయిన చేయడానికి రెడీగా వుంటాం.అయితే అది కథకు సరిపొతుందా లేదా ? అనేది ముఖ్యం.దర్శకుడు ఎంతో కాలం కష్టపడి ఒక కథని రెడీ చేసుకుంటాడు.కథని లిరికల్ గా చెప్పడానికి పాట కావాలి.ఇది చాలా పెద్ద భాద్యత.ఇప్పడు కథలో నుంచి వచ్చే పాటలే ఎక్కువ.

సర్కారు వారి పాటలో కళావతి పాట ఇలా కథలో నుంచి వచ్చిందే.చాలా రోజుల తర్వాత ఒక మెలోడి పాటకు థియేటర్ స్టేజ్ ఎక్కి ఆడియన్స్ డ్యాన్స్ చేస్తారు.

అంత అద్భుతంగా వుంటుంది కళావతి సాంగ్.

Telugu Parashuram, Heorinekeerthy, Mahesh Babu, Kalaavathi, Music, Sarkaruvaari,

కళావతి పాట ఓకే అవ్వడానికి ఎన్ని వెర్షన్స్ చేశారు ?

ఒకటే వెర్షన్.2020 లాక్ డౌన్ లో చేసిన పాటది.నేను, దర్శకుడు పరశురాం గారు, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైను.

నాకు సామజవరగమనా , దర్శకుడు పరశురాం కి ఇంకేం ఇంకేం కావాలె లాంటి మేలోడిస్ వున్నాయి.ఖచ్చితంగా ఆడియన్స్ చాలా అంచనాలతో వుంటారు, అన్నిటికంటే ముఖ్యం మహేష్ బాబు గారు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్.

ఇది చాలా ప్యూర్ గా డిజైన్ చేయాలనీ ముందే అనుకున్నాం.అలా కళావతి పాటతో కంపోజింగ్ స్టార్ట్ చేశాం.అయితే పాట కంపోజ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది.ఈ గ్యాప్ లో పాటకు రోజు ప్రాణం పోస్తూ చివరిగా రిలీజ్ చేశాం.

మా కష్టం వృధా కాలేదు.ఫాస్టెస్ట్ గా 150 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి కళావతి పాట అందరినీ అలరించింది.

ఒక ఆల్బం ఆరు పాటలు వుంటే మొదట ఏం పాట విడుదల చేయాలనే చర్చ ఉంటుందా ?

ఖచ్చితంగా వుంటుంది.మా సినిమానే కాకుండా ఆ సమయానికి బయట సినిమాల్లో ఎలాంటి పాటలు వస్తున్నాయనేది కూడా చూస్తాం.

కళావతి పాట విడుదలకి ముందు డీజే టిల్లు, లాలా భీమ్లా నాయక్, బీస్ట్ పాటలు ట్రెండింగ్ లో వున్నాయి.ఈమూడు పాటలు కూడా లౌడ్ మాస్ సాంగ్స్.

అలాంటి సమయంలో మెలోడి సాంగ్ అయితే బెస్ట్ అని భావించాం.కళావతి పాట రిలీజ్ చేశాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube