నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్యాతిథులుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ నారాయణ్,డిఎస్పి రాజశేఖర్ రాజు హాజరై క్రైస్తవ సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం కేక్ కటింగ్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదరుల ఆరాధ్య దైవం క్రీస్తు జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమతో విందు ఏర్పాటు చేసి,ప్రభువు ఆశీస్సులు మీ అందరికీ చేరేలా చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధైవజనులకు, మిర్యాలగూడ నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డిఎస్పీ రాజశేఖర్ రాజు, తాహసిల్దార్ హరిబాబు, ఇతర అధికారులు, ధైవజనులు,కాంగ్రెస్ నాయకులు,బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.