మోత్కూరును రెవిన్యూ డివిజన్ చేయాలని కలెక్టర్ కు వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మండలాన్ని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెవిన్యూ డివిజన్ లేకపోవడం వల్ల మండలం నుండి జిల్లా కేంద్రమైన భువసగిరికి వెళ్లాలంటే 42 కి.

 A Request To The Collector To Make Mothkur A Revenue Division, Bc Reservation ,-TeluguStop.com

మీ.ఇక అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ ప్రజలు సుమారుగా 70 కి.మీ.దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల సౌలభ్యం కొరకు గత ప్రభుత్వం 5 మండలాలకు ఒక రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంత్యంత వెనుకబడిన మండలంగా మోత్కూరు ఉందని, ప్రజల సౌలభ్యం,సరైన పరిపాలనకు నోచుకోవాలంటే అడ్డగూడూరు,గుండాల, ఆత్మకూరు(ఎం), మోటకొండూరు మండలాలను కలిపి రెవిన్యూ డివిజన్ చేయవల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయుటకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య,జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube