ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా

సూర్యాపేట జిల్లా:ఇంటి పన్ను చెల్లించలేదంటూ ఇంటి ముందు మున్సిపల్ కమిషనర్ తో సహా సిబ్బంది ధర్నాకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి మాట్లాడుతూ మూడవ వార్డులో నివసిస్తున్న భానోత్ బీమా 2015-2016 సంవత్సరం నుండి ఇంటి పన్ను చెల్లించకుండా బకాయి పడ్డారని,మున్సిపల్ సిబ్బంది ప్రతినిత్యం ఇంటి పన్ను వసూళ్ల కోసం వెళుతుండగా రేపు మాపని వాయిదాలు వేస్తూ రహదారి సౌకర్యం లేదని,డ్రైనేజీ సౌకర్యం లేదని,ఏదో ఒక సాకుతో పన్ను చెల్లించకుండా జాప్యం చేస్తున్నాడన్నారు.

 Municipal Staff Stage A Sit-in In Front Of A House That Has Not Paid Its House T-TeluguStop.com

ఇటీవల ఒత్తిడి చేయగా 3 వేల రూపాయల పన్ను చెల్లించాడని,ఇంకా రూ.27,542 ఇంటి పన్ను బకాయి ఉండగా ప్రభుత్వం కల్పిస్తున్న 90 శాతం వడ్డీ రాయితీని ఉపయోగించుకుని చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నప్పటికీ చెల్లించడంలేదన్నారు.గతంలో కూడా రెండుసార్లు వడ్డీ రాయితీ అవకాశం వచ్చినప్పటికీ చెల్లించలేదని,దీంతో రెడ్ నోటీస్ జారీ చేసినప్పటికీ స్పందించక పోవడంతో నీటి సరఫరా బందు చేసి,డ్రైనేజీ మూసేసి సిబ్బందితో ధర్నా చేసినట్లు పేర్కొన్నారు.మరో ఇంటి ముందు కూడా ఇంటి పన్ను కట్టలేదంటూ ధర్నా చేపట్టారు.

ఈ ధర్నాలో మున్సిపల్ మేనేజర్ యాకూబ్ అలి,వార్డు అధికారులు,ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube