ఫణిగిరి బౌద్ధక్షేత్రం తెలంగాణకే తలమానికం

సూర్యాపేట జిల్లా:ప్రపంచ పటంలో నిలిచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం తెలంగాణకే తలమానికమని పురావస్తు శాఖ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యార్,డైరెక్టర్ భారతీ హోలీ కేరి అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో బయటపడ్డ పురాతన కాలం నాటి నాణాలను వారు పరిశీలించారు.

 Phanigiri Buddhist Temple Is The Capital Of Telangana , Telangana, Phanigiri Bud-TeluguStop.com

అనంతరం వారు మాట్లడుతూ 2023-24 మార్చి 11న ప్రారంభమైన ఫణిగిరి తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలంనాటి మట్టి పాత్రలో 3730 సీసపు నాణాలు, రాతి పూసలు,సున్నపు రాతి విగ్రహాలు లభించాయన్నారు.భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ దొరకని 3730 నాణాలు లభించాయని,ఈ నాణాలు ఒకవైపు ఏనుగు,మరోవైపు ఉజ్జయిని గుర్తులు కలిగి ఉన్నాయని,ఇక్ష్వాకుల కాలం నాటి నాణములుగా క్రీ.

శే 2-4 శతాబ్దంగా నిర్ధారించినట్లు తెలిపారు.ఆర్కియాలజీ సిబ్బంది శ్రమ వెలకట్టలేనిదని,మన సంపద న్యూయార్క్ నగరంలో ప్రదర్శన చేశారని,ఇది మన సంపద దీనిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

ఇక్కడి బౌద్ధ సంపద అమరావతి, నేలకొండపల్లి ఎక్కడ కూడా లేదని,చాడలో కూడా తవ్వకాలు ప్రారంభించామని,విదేశాల నుంచి కూడా ఫణిగిరికి వైపే పర్యాటకులు చూస్తున్నారన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube